హుజూర్ నగర్ బైపోల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

హుజూర్ నగర్ ఉప ఎన్నిక లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సూర్యాపేట జిల్లా అధికారులు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.  22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక్కో రౌండ్ కౌంటింగ్ కు 15 నుండి 20 నిమిషాలు పట్టే అవకాశముంది. తుది ఫలితం మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చే ఛాన్సుందన్నారు కలెక్టర్ అమాయ్ కుమార్.

Latest Updates