హైదరాబాద్ మెట్రోలో పెద్ద శబ్దం.. మధ్యలోనే ఆగిన రైలు

హైదరాబాద్ మెట్రో రైలు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. నాగోల్ నుంచి హైటెక్ సిటీకి వెళ్తున్న మెట్రోరైలు అమీర్ పేట స్టేషన్ పరిధిలో పిల్లర్ నెంబర్ 1449వద్ద  నిలిచిపోయింది. ఒక్కసారి  పెద్దగా శబ్ధం రావడంతో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులను అక్కడి స్టేషన్లో దించేశారు అధికారులు.

అయితే విద్యుత్ సరఫరాలో లోపమే కారమని మెట్రో అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సమస్య కారణంగా ఆ ప్రాంతంలో సింగిల్ లైన్ విధానంలో రైళ్లను నడుపుతున్నామన్నారు. దీంతో మెట్రో రైలు కొంత ఆలస్యం అవుతుందన్నారు.

Latest Updates