వీకెండ్ లో ఔటింగ్​కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నసిటిజన్స్

హైదరాబాద్, వెలుగు : కరోనా వైరస్… లాక్ డౌన్‌ తో  సిటిజన్స్‌  ఎంజాయ్​ లైఫ్‌కు బ్రేక్‌ పడింది. నెలలుగా ఇళ్లలోనే ఉండిపోయారు. వీకెండ్ వస్తే ఎంజాయ్‌ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం అన్ లాక్ 4 తో అంతా మామూలు  స్థితికి వచ్చింది.  మరోవైపు జనాల్లో వైరస్  టెన్షన్‌ కూడా తగ్గుతుంది. కరోనాతో లైఫ్‌ను కొనసాగించాల్సిందేనని మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూనే  ఔటింగ్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. వీకెండ్స్‌లో నచ్చిన ప్లేస్ కు యూత్‌, ఫ్యామిలీస్‌ తో వెళ్తున్నారు. సిటీలోని గ్రీనరీ స్పాట్స్ తో పాటు సమీపంలోని ఫారెస్ట్‌, హిల్, వాటర్ ప్లేసెస్,  రిసార్ట్​లకు వెళ్లొస్తున్నారు.

ఒత్తి​డి నుంచి బయటపడేందుకు..

లాక్‌డౌన్‌తో నెలల తరబడి ఒకేచోట ఉండడంతో  పలు రకాల మానసిక టెన్షన్స్‌ తో సతమతమయ్యారు. ఒంటరిగా ఉన్నవారు యాంగ్జైటీ, డిప్రెషన్ లోకి కూడా వెళ్లారు. మళ్లీ మాములు పరిస్థితి ఉంటుందా.. లేదా అనే డైలామాలో పడిపోయారు.  ఇలా ఉక్కిరిబిక్కిరి అయిన వారికి అన్ లాక్ కాస్త హాయినిస్తుంది. టూరిజం ప్లేసెస్ కి పర్మిషన్‌ లేకున్నా సిటీలోని ఇతరాత్ర ఆల్టర్నేటివ్ ప్లేసెస్ కు సిటిజన్స్‌ వెళ్తున్నారు. సాయంకాలం ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్ లాంటిప్లేసెస్ కి  షికారుకు వెళ్లడం, కొత్తగా ఏర్పాటైన దుర్గం చెరువు బ్రిడ్జి పైకి వెళ్లి గ్రీనరీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వెళ్లి గడిపేస్తున్నారు. అంతేకాదు సేఫ్టీ ప్రికాషన్స్‌ తీసుకొని లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకుని మరి చూట్టొస్తున్నారు.

సందడిగా కనిపిస్తున్నయ్‌

వికారాబాద్, బోడకొండ వాటర్ ఫాల్స్, అనంతగిరి హిల్స్, గండిపేట్, శ్రీశైలం డ్యామ్, రిసార్ట్స్ కి వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో ఈ ప్లేస్ లన్నీ సిటిజన్స్​తో సందడిగా కనిపిస్తున్నాయి. ఇన్ని నెలల తర్వాత ఔటింగ్‌కు వెళ్లి  ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉందని పలువురు సిటిజన్స్‌ పేర్కొంటున్నారు.

రిలాక్స్​డ్‌గా ఫీల్ అయ్యాం

కరోనా ఎఫెక్ట్‌.. లాక్ డౌన్ తో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నా. ఎన్ని నెలలని ఒకేచోట ఉంటాం.   అన్ లాక్ తో అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ అందరం ఔటిం గ్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. వీకెండ్‌ లో వికారాబాద్ కి లాంగ్ డ్రైవ్ వెళ్లాం. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని  పచ్చని పొలా లు, చెరువుల దగ్గర టైం స్పెండ్ చేశాం. చాలా రిలాక్స్​డ్​గా ఫీల్‌ అయ్యాం.

–  రోహన్‌, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, కూకట్‌పల్లి

రెస్పాన్స్‌ బాగుంది

గండిపేట్ లో రీసెంట్ గా రెండు నెలల కింద రిసార్ట్‌ స్టార్ట్ చేశాం. నేషనల్ పార్క్ థీమ్ తో  జంగిల్ ఫీల్ వచ్చేలా క్రియేట్ చేశాం. వైల్డర్ నెస్ రీట్రీట్ పేరుతో హట్స్ , ట్రీ హట్స్ ఏర్పాటుచేశాం. అన్‌లాక్‌ తర్వాత బుకింగ్స్ చాలా వస్తున్నాయి. సైక్లింగ్, అడ్వెంచర్ ఆక్టివిటీస్ అందుబా టులో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసు కునేవారికి అందుకు అనుగుణంగా స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. రెస్పాన్స్ చాలా బా గుంది. డిఫరెంట్‌ ప్యాకేజీలు అందుబా టులో ఉన్నాయి. అందరికి అందుబాటు లో ఉండే విధంగా ఛార్జ్ చేస్తున్నాం.

– మేనేజింగ్ డైరెక్టర్ , వైల్డర్ నెస్ రీట్రీట్, గండిపేట్

Latest Updates