హైదరాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులో బాడీ స్కానర్స్‌‌

హైదరాబాద్‌‌: బ్యూరో ఆఫ్‌‌ సివిల్‌‌ ఏవియేషన్‌‌ (బీసీఏఎస్‌‌) ఆదేశాల మేరకు హైదరాబాద్‌‌ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్టు  ప్యాసింజర్లకు బాడీస్కానర్‌‌ తనిఖీలను మొదలుపెట్టింది. మూడు నెలలపాటు ఈ స్కానర్లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. డొమెస్టిక్‌‌ డిపార్చర్‌‌ టెర్మినల్‌‌ వద్ద దీనిని అమర్చినట్టు ఎయిర్‌‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎంఆర్‌‌ తెలిపింది. అక్టోబర్​12 నుంచి దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని పేర్కొంది. ప్రయోగాలు పూర్తై, అన్ని అనుమతులూ వస్తే మిగతా టెర్మినల్స్‌‌లోనూ ఈ స్కానర్లను ఏర్పాటు చేస్తారు. ఇవి సేఫ్‌‌ రేడియో వేవ్‌‌ సెక్యూరిటీ విధానం ద్వారా పనిచేస్తాయి కాబట్టి గోప్యతాపరమైన ఇబ్బందులు ఏమీ ఉండబోవని జీఎంఆర్‌‌ తెలిపింది. బాడీ స్కానర్‌‌ తనిఖీలు తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని వివరించింది.

Hyderabad airport begins trials on body scanners

Latest Updates