గ్లోబల్  సిటీ గా హైదరాబాద్ నగరం: సీఎం కేసీఆర్

హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్  సిటీ గా మార్చేందుకు అవసరమైన ప్లాన్స్ రెడీ చేసి అమలు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో…జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా.. మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. నగరాలు డెవలప్ అవుతున్న కొద్దీ….కొన్ని సమస్యలు వస్తున్నాయని అలాంటి వాటిని ముందుగానే అంచనా వేసి పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మాస్టర్ ప్లాన్ ను మంత్రివర్గం తప్ప మరెవ్వరూ మార్పులు చేయకుండా చట్టం తెస్తామన్నారు. హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా నిర్మించే అంశంపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. నగర సమగ్రాభివృద్ధి బాధ్యత HMDAపై మాత్రమే పెట్టకుండా, వివిధ రంగాలకు చెందిన వారితో ప్రాధికార సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ నిధులతోపాటు…ఇతర నిధులు సమకూరుస్తామని చెప్పారు సీఎం.

ఓఆర్ఆర్ లోపల, బయట…ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ మధ్యనున్న నగరం, అవతల విస్తరించే నగరాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తామన్నారు సీఎం. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం…నగరానికి వలసలు పెరుగుతున్నాయన్నారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తరలి రావటంతో ఉద్యోగావకాశాలు పెరిగాయని చెప్పారు. హోటల్, నిర్మాణ రంగంలోనూ ఎంతోమందికి ఉపాధి దొరుకుతోందన్నారు. ప్రతిఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్ లో పెరుగుతోందని చెప్పారు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే నగర జీవితం నరకప్రాయం కాక తప్పదన్నారు.

మూసీని మురికిప్రాయం చేశారని.. నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని.. ట్రాఫిక్ సమస్యలు ఎదురౌతున్నాయని అన్నారు కేసీఆర్. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగినట్లు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే.. నగర జీవితం నరకప్రాయంగా మారక తప్పదన్నారు సీఎం. అందుకే ఇప్పుడే మేల్కొనాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి, అమలు చేయాలని చెప్పారు కేసీఆర్.

హైదరాబాద్  నగరం లోపలా, బయటా పచ్చదనం పెంచడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నింటినీ ప్రధాన నగరం అవతలికి తరలించటంతో పాటు…మూతపడిన పరిశ్రమల భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలన్నారు.

హైదరాబాద్ జనాభా పరిస్థితి, రోడ్లు, ట్రాఫిక్, సీవరేజి పరిస్థితి, గ్రీన్ కవర్ పరిస్థితి, వాహనాల సంఖ్య, రవాణా వ్యవస్థ, విద్యుత్, తాగునీరు ఇలా అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. నగర ప్రజలకు మంచినీరు అందించేందుకు కేశవాపూర్ లో తలపెట్టిన మంచినీటి రిజర్వాయర్ కు.. ఈ నెలలోనే శంకుస్థాపన చేసి, శరవేగంగా పూర్తి చేస్తామన్నారు మెట్రోరైలు ఎయిర్ పోర్టు వరకు విస్తరిస్తామన్నారు.

Latest Updates