రూ.100లోపు కడుపు నిండా తినొచ్చు

హైద‌రాబాద్‌: అతి తక్కువ ధరకే కడుపు నిండా భోజనం పెడుతున్నామని తెలిపారు అయ్యంగార్ ఇండ్లీదోశ క్యాంటీన్ నిర్వాహకులు. రూ.50 చెల్లిస్తే ఇష్టం వ‌చ్చిన‌న్ని ఇడ్లీలు, దోశ‌లు, పొంగ‌ల్‌ ను టిఫిన్ గా తినొచ్చు. రూ.100 ఎంతైనా భోజ‌నం చేయ‌వ‌చ్చు… ఇదంతా హైదరాబాద్‌ లోని LB న‌గ‌ర్ మెట్రోస్టేష‌న్‌ లో.

ఇటీవలే.. మెట్రోస్టేష‌న్‌ లో అయ్యంగార్ ఇడ్లీదోశ క్యాంటీన్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ క్యాంటీన్‌ ను మెట్రో రైలు అధికారి అనిల్‌ కుమార్ షైనీ, త‌దిత‌రులు ప్రారంభించారు. మధ్య తరగతి వారికి ఈ క్యాంటీన్ ఆకలి తీరుస్తుందన్నారు.

Latest Updates