ఈ కప్​లో తాగొచ్చు, తర్వాత కప్పూ తినేయొచ్చు

హైదరాబాద్, వెలుగు : సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో దానికి తగ్గట్టు కంపెనీలు మారుతున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే డిస్పోజబుల్ పేపర్ కప్స్‌‌కు బదులు.. జినోమ్ ల్యాబ్స్ ‘ఈట్ కప్‌‌’ను తీసుకొచ్చింది. ఈట్ కప్‌‌ను సహజ ధాన్యాల నుంచి రూపొందించామని జినోమ్ ల్యాబ్స్ బయో ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ రాజు చెప్పారు.

ఈ కప్‌‌ను తినొచ్చని, మంచి రుచికరంగా కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీనిలో ఫైబర్ బాగా ఉంటుందని తెలిపారు.  ప్లాస్టిక్, పేపర్ కప్‌‌లకు ఇది ప్రత్యామ్నాయం. వేడి, చల్లటి బేవరేజస్‌‌కు, సూప్స్‌‌, యోగార్ట్ వంటి అన్ని రకాల వాటికి ఈట్ కప్​ను వాడొచ్చు.   తాగడం అయిపోయిన తర్వాత, ఆ కప్‌‌ను కూడా తినేయొచ్చు.

Latest Updates