నిరుపేద విద్యార్ధుల‌కు అండ‌గా..ఉచితంగా ఆన్ లైన్ క్లాసులు

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో హైద‌రాబాద్ కు చెందిన య‌శోద ఫౌండేష‌న్ అనే ఎన్జీఓ సంస్థ నిరుపేద విద్యార్ధుల‌కు, గ‌వ‌ర్న‌మెంట్ పాఠ‌శాల స్కూల్ విద్యార్ధుల‌కు ఉచితంగా ఆన్ లైన్ క్లాసుల్ని నిర్వ‌హిస్తోంది.

లాక్ డౌన్ ముందు మురికి వాడ‌ల్లో కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఎన్జీఓ ప్ర‌తినిధి న‌వీన్ కుమార్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని
య‌శోద ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ సంతోష్ కుమార్ పిల్ల‌ల‌కు ఉచితంగా విద్యాను అందించేందుకు దిశ అనే ప్రాజెక్ట్ పేరుతో ముందుకు వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యేందుకు మైక్రోసాప్ట్ సంస్థ ముందుకొచ్చిన‌ట్లు తెలిపిన న‌వీన్ కుమార్..ఆన్ లైన్ క్లాసుల్లో ‌ పాల్గొనే విద్యార్ధులు ధ‌రఖాస్తు చేసుకోవాల‌ని చెప్పారు.

విద్యార్ధుల‌కు ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హించ‌డం చాలా క‌ష్టం, ఖర్చుతో కూడుకున్న‌ది. అయినా స‌రే విద్యార్ధుల‌కు ఉచితంగా విద్య‌ను అందించేందుకు టీచ‌ర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు సంస్థ నిర్వాహ‌కులు తెలిపారు.

Latest Updates