సీత సినిమాను బ్యాన్ చేయండి : BJYM డిమాండ్

hyderabad-bjym-demands-to-ban-sita-movie

డైరెక్టర్ తేజ దర్శకత్వంలో కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా రూపొందిన ‘సీత’ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు పెట్టిన సీత టైటిల్ పై భారతీయ జనతా యువమోర్చా హైదరాబాద్ శాఖ అభ్యంతరం చెబుతోంది.

సీత అనే పేరు భారత పురాణాలకు సంబంధించినదనీ.. ఆ పేరును హిందువులు పవిత్రంగా భావిస్తారని BJYM చెబుతోంది. సినిమాలో చూపించిన సన్నివేశాలు.. అందులో కథానాయిక పాత్రతోనూ.. ఆ పాత్రను ఉద్దేశించి ఇతర పాత్రలతోనూ పలికించిన సంభాషణలు సీత పేరును కించపరిచేలా ఉన్నాయని అభ్యంతరం చెబుతోంది. ఫిమేల్ లీడ్ పాత్ర తీరు.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపించింది. క్రియేటివిటీ పేరుతో… సినిమా మేకర్స్ మన సనాతన సంప్రదాయాలు, విలువలను దిగజార్చడం కరెక్ట్ కాదని తెలిపింది. ఈ మూవీని బ్యాన్ చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నట్టు BJYM హైదరాబాద్ అధ్యక్షుడు ఎ.వినయ్ కుమార్ తెలిపారు.

Latest Updates