విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోతే..

కార్పొరేట్ , ప్రేవేట్ స్కూల్ లలో లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నా…  విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని భారతీయ జనతా యువ మోర్చా ఆరోపించింది. ఈ రోజు అబిడ్స్ ఛాపెల్ రోడ్ లోని లిటిల్ ప్లవర్ స్కూల్ ముందు అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారంటూ బిజెవైఎం నగర అధ్యక్షుడు వినయ్ ఆధ్వర్యంలో పలు నిరసన కారులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ ఆదేశాలను పట్టించుకోకుండా 20 వేలు ఉండాల్సిన ట్యూషన్ ఫీజులను 2 నుండి 3 లక్షల వరకు స్కూళ్ల యాజమాన్యాలు  వసూళ్లు చేస్తుందని వారు ఆరోపించారు.

కార్పొరేట్ , ప్రేవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇలా వ్యవహరిస్తున్నా.. జిల్లా విద్యాశాఖ అధికారి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వినయ్ అన్నారు. విద్యా శాఖ అధికారులు తనిఖీలు చెయ్యకుండా ఎవరికి అందినంత వారు యాజమాన్యాల నుండి దండుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నిబంధనలు పాటించకుండా ఉన్న స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని… లేని పక్షంలో బిజెవైఎం డీఈవో కార్యాలయం , విద్యాశాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Latest Updates