సీసీటీవీ సర్వైలెన్స్‌లో నం.1 ప్లేస్‌లో హైదరాబాద్.. వరల్డ్‌ టాప్‌–20లో చోటు

న్యూఢిల్లీ: హైదరాబాద్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దేశంలో అత్యధిక సీసీటైవీ సర్వైలెన్స్‌ కలిగి ఉన్న సిటీగా నంబర్ వన్  స్థానంలో నిలిచింది. అంతేగాక ఈ లిస్ట్‌లో ప్రపంచంలో టాప్–20లో చోటు సంపాదించింది. యూకేకు చెందిన కంపారిటెక్ అనే కంపెనీ బుధవారం విడుదల చేసిన రిపోర్ట్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వీపీఎన్, యాంటీవైరస్ యాప్స్‌ వాడకంలో తెలంగాణ రాజధాని వరల్డ్‌వైడ్‌గా 16వ ప్లేస్‌లో నిలిచింది. అలాగే రెండు నాన్‌–చైనా సిటీల్లో ఒకటిగా సగర్వంగా స్థానం దక్కించుకుంది.

కంపారిటెక్‌ రిపోర్ట్‌ ప్రకారం.. సర్వైలన్స్‌లో చైనా నం.1 పొజిషన్‌లో ఉంది. 20 నగరాల్లో 18 చైనాలోనివే కావడం గమనార్హం. ఈ జాబితాలో చైనాలోని తైయువాన్ టాప్‌లో నిలిచింది. ఈ సిటీలో 4.65 లక్షల సీసీ కెమెరాలను వాడుతుండటం విశేషం. 3 లక్షల సీసీటీవీల వినియోగంతో హైదరాబాద్‌ 15వ ప్లేస్‌లో నిలిచింది. భాగ్య నగరంలో ప్రతి 1,000 మందికి 29.99 సీసీటీవీలు ఉన్నాయి. సర్వైలెన్స్‌లో దేశంలోని మిగతా సిటీల్లో చెన్నై 21, ఢిల్లీ 33 స్థానాలు దక్కించుకున్నాయి

Latest Updates