క‌రోనాతో హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రి  ల్యాబ్ టెక్నిషియ‌న్ మృతి

హైద‌రాబాద్ చెస్ట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్న గోవర్ధన్ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. గోవర్థన్ గత కొంతకాలంగా చెస్ట్ హాస్పిటల్ లో కరోన రోగులకు స్క్వాబ్స్ తీయడం లో కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది.

దీంతో 14 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన గోవర్థన్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. అలాగే మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్ లకు కూడా పాజిటివ్ నిర్ధార‌ణ కావడంతో వారికి అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

Latest Updates