CBS నుంచి సిటీ బస్సును ఎత్తుకుపోయాడు

హైదరాబాద్: సెంట్రల్ బస్ స్టేషన్ (CBS)లో ఓ సిటీ బస్సును ఎత్తుకుపోయారు దొంగలు. కుషాయిగూడ డిపోకు చెందిన AP11z 6254 సిటీ సర్వీస్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు.

మంగళవారం రాత్రి కుషాయిగూడ నుండి CBSకు చేరిన బస్సును డ్రైవర్ జె.వెంకటేష్ బస్టాండ్ షెడ్ లో పార్క్ చేశాడు.  తిరిగి బుధవారం ఉదయం 5 గంటలకు CBS నుంచి ప్రారంభించేందుకు డ్రైవర్ అక్కడే నిద్రపోయాడు. తెల్లవారుజామున 4:30 నిమిషాలకు నిద్ర లేచిన డ్రైవర్ కు… పార్క్ చేసిన బస్సు కనిపించలేదు. వెంటనే కుషాయిగూడ డిపో మేనేజర్ కు సమాచారం ఇచ్చాడు. బస్సు మిస్ అయిందని గుర్తించి… అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కేసు ఫైల్ చేసిన అప్జల్ గంజ్ పోలీసులు దర్యాప్తు చేశారు. బస్ ను ఎవరో తీసుకెళ్లినట్టు అక్కడి సీసీ ఫుటేజ్ లో తెలిసింది. ఐతే.. నిందితులను గుర్తుపట్టలేకపోయారు. చుట్టుపక్కల ఉన్న అన్ని చెక్ పోస్టులు, టోల్ ప్లాజాలకు.. బస్సు నంబర్, ఇతర వివరాలు ఇచ్చి సమాచారం సేకరించారు.

మంగళవారం అర్ధరాత్రి 1:10 నిమిషాలకు తూప్రాన్ టోల్ గేట్ దాటుతుండగా సీసీటీవీ కెమెరాల్లో ఆ బస్సు విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తూప్రాన్ టోల్ గేట్ సిబ్బందిని… బస్సు నడిపిన వ్యక్తి… నాందేడ్ వరకు రూట్ కనుక్కుని డబ్బు చెల్లించినట్టు గుర్తించారు. అప్జల్ గంజ్ పోలీసులు ప్రత్యేక టీమ్ తో గాలించారు.

Latest Updates