క‌రోనా టైం లోనూ ఇండ్లు కొన‌డంలో హైద‌రాబాద్ హ‌వా

భారతదేశ వ్యాప్తంగా మార్కెట్‌లన్నీ కూడా కరోనా వైరస్‌ కారణంగా ఆర్ధికంగా కోలుకోలేని స్థితికి చేరినప్పటికీ 2020 సంవత్సరం మూడవ త్రైమాసం(జూలై–సెప్టెంబర్)లో హౌసింగ్ మార్కెట్‌లన్నీ కూడా కాస్త శక్తిని పుంజుకున్నాయి. సౌత్ ఇండియాలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ దీనికి బాగా తోడ్పడింది. ‌

రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ భారతదేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాలలో చేప‌ట్టిన నివేదిక ప్ర‌కారం.. ప్రీవియ‌స్ క్వార్ట‌ర్‌తో పోలిస్తే మూడు నెల‌ల కాలంలో కొత్త స‌ప్ల‌య్ (నూతన సరఫరా) రెట్టింపుకన్నా ఎక్కువ అయిన‌ ఒకే ఒక్క నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. నిజానికి మొత్తంమ్మీద నేష‌న‌ల్ ఎనాల‌సిస్ క్యూ3 , 2020 ప్ర‌కారం.. హైదరాబాద్‌ నగరం కన్నా అధికంగా నూతన ఆవిష్కరణలను చూసిన ఒకే ఒక్క నగరంగా పూణె నిలిచింది.

South centres’ performance during July-September period

City                Launches        Sales          Unsold Stock

Bengaluru      2,086             4,825            72,754

Chennai         947                2,317            34,902

Hyderabad     4,264             3,260            33,072

Source: Real Insight Q3 202

సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు చూస్తే హౌసింగ్ సేల్స్‌లో సౌత్ ఇండియాలో బెంగళూరు ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. మొత్తం 4825 ఇండ్ల సేల్స్ జ‌ర‌గ్గా త‌ర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌, చెన్నై ఉన్నాయి.

సెప్టెంబర్‌ 30 నాటికి ఈ మూడు నగరాలలో ఇన్వెంటరీ స్టాక్‌ 140,728 గా చేరింది. ఈ స్టాక్‌లో బెంగళూరు వాటా అత్యధికంగా ఉంది. ఈ నివేదికలో ఉన్న ఎనిమిది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో అతి తక్కువగా ఇన్వెంటరీ ఉంది (25 నెలలు). బెంగళూరు (36), చెన్నై (39)లు అత్యధికంగా ఉన్నాయి. అయితే, ఈ ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్‌ హైదరాబాద్‌లో గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో 13 నెలల ఓవర్‌హ్యాంగ్‌ ఉంటే ఇప్పుడు అది 25 నెలలకు పెరిగింది.

Latest Updates