నగరవాసులను వణికిస్తున్న టవర్లు, హోర్డింగులు

Hyderabad City inhabitants worrying about towers n Hoardings which were built near to their places

వానాకాలాని ముందే తొలగిస్తే మంచిది.

సిటీలో ఇష్టమున్నట్టు ఏర్పాటు చేసిన సెల్ టవర్లు, హోర్డింగులు, యూనిపోల్స్ నగరవాసులను భయపెడుతున్నాయి. ఇటీవల గాలి దుమారానికి ఎల్బీ స్టేడియంలో ఉన్న ప్లడ్ లైట్ కుప్ప కూలి ఒక వ్యక్తి చనిపోయిన ఘటనతో సిటీ జనం ఆందోళనకు గురవుతున్నారు. వీటి నిర్వహణను పర్యవేక్షించాల్సిన జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఉండడంతోనే ఎక్కడపడితే అక్కడ టవర్లు ఏర్పాటు చేశారన్న ఆరోపణలున్నాయి.

హైదరాబాద్ , వెలుగు: గ్రేటర్ పరిధిలో 2600కు పైగా హోర్డింగులు, యూనిపోల్స్ ఉండగా, 2 వేలకు పైనే సెల్ టవర్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. అంతేకాకుండా అనుమతులు లేకుండా నగరంలో ఏర్పాటు చేసినవే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటిపై అధికారులు అప్పడప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. ఏజెన్సీలు ఇష్టానుసారంగా కొత్త సెల్ టవర్లు, హోర్డింగులు, యూనిపోళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. గాలివానతో ప్రమాదాలు జరిగిన రోజున స్ట్రక్చరల్ స్టెబిలిటీ వంటి అంశాలను తెరమీదకు తెచ్చి, ఆ తర్వాత వాటి గురించి మరిచిపోవడం జీహెచ్ ఎంసీకి సర్వసాధారణంగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. గ్రౌండ్‌ బేస్డ్‌‌ టవర్‌‌, రూఫ్‌ టాప్‌ టవర్‌‌, రూఫ్‌టాప్‌ పోల్స్‌‌, సెల్‌‌ ఫోన్‌ టవర్‌‌, యాంటెన్నా,ఫ్యాబ్రికేటెడ్‌ యాంటెన్నా, టెలిఫోన్‌ లైన్లు లేదా ట్రాన్స్‌‌మిషన్‌ టవర్లు సహా టెలికమ్యూనికేషన్‌ ఇన్‌ ఫ్రా టవర్లకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించిన అవి సక్రమంగా అమలు కావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని సవరిస్తూ నూతన మార్గదర్శకాలను అమలు చేస్తోంది.

నిబంధనలివే..

టవర్‌‌ ఏర్పాటు చేసుకోవాల్సిన భవనానికి చెందిన లొకేషన్‌ ప్లాన్‌ తోపాటు అక్కడికివెళ్లే మార్గాన్నీ చూపే మ్యాప్​, ఎలివేషన్‌ ప్లాన్‌ ఉండాలి. సెక్షన్‌ ప్లాన్‌ , స్ట్రక్చరల్‌‌ స్టెబిలిటీ సర్టి-ఫికెట్‌ , యాజమాన్య పత్రాలు, లీజ్ ఒప్పంద పత్రాలు, ప్రమాదం జరిగిన సందర్భంలో బాధ్యత వహిస్తూ ఇచ్చే ఇండెమ్నిటీ బాండ్‌ ,నష్టపరిహారాన్ని చెల్లించేందుకూ అంగీకరిస్తూ బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక శాఖ, పర్యావరణ,అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి క్లియరెన్స్ తీసుకోవాలి. అదే విధంగా టవర్ల ఎత్తు 40 ఫీట్లకు మించకుండా ఉండాలనే నిబంధన ఉంది. కానీ సిటీలో అంతకంటే ఎత్తులోనే పలు కంపెనీల టవర్లున్నట్టు తెలుస్తోంది. వానాకాలంలో100–150 కి.మీ. గాలివేగాన్ని తట్టు కునే సామర్థ్యం ఉండేలా టవర్లను ఏర్పాటు చేయాలి.

కానీ ఇవేవీ పట్టించుకోకుండానే ఆయా కంపెనీలు టవర్లు ఏర్పాటుచేస్తున్నాయి. చాలావరకు ప్రకటన సంస్థలకు చెందినవే ఇందులో ఉన్నట్టు సమాచారం.గతంలో జోన్‌ కు ఇద్దరు చొప్పున జీహెచ్‌‌ఎంసీ-లో పదిమంది స్ట్రక్చరల్ ఇంజినీర్లు, నిపుణులతో హోర్డింగ్‌ ల సామర్థ్యంపై అంచనా వేసినప్పటికీ ఆ తర్వాత దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ తెలుస్తుంది. వర్షాకాలం లోగా అనుమతుల్లేని టవర్లు, హోర్డింగులు, షెడ్లను తొలగించాలని లేకుంటే నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులను నగరవాసులను కోరుతున్నారు.

Latest Updates