అంజన్న ర్యాలీకి.. సిటీ రెడీ

Hyderabad city police ready to arrange full security hanuman jayanthi rally
 • రూట్ మ్యాప్ సిద్ధం
 • భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు
 • ర్యాలీ పొడవునా సీసీ కెమెరాలు
 • ప్రశాంతంగా నిర్వహించాలి-: సీపీ అంజనీకుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం సిటీలో నిర్వహించే శోభాయాత్రకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గుడ్ ఫ్రై డే, హనుమాన్ జయంతి ఒకే రోజు కావడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 15 వేల మంది పోలీసులు, 450 సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్ బండ్ దాకా 12 కిలో మీటర్ల పొడవున ఈ యాత్ర సాగనుంది.నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 15కు పైగా హనుమాన్ భక్తుల ర్యా లీలు శోభాయాత్రలో చేరుతాయి. గౌలిగూడ రామమందిరం నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 7:30 గంటలకు సికింద్రాబాద్ తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ర్యాలీ ముగియనుంది. 

శోభాయాత్రలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు పక్కా ఏర్పాట్లు చేశారు.దాదాపు 85 వేల మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. గౌలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు జరిగే యాత్రలో పకడ్బందీ నిఘా పెట్టారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన హై డెఫినెషన్ సీసీ కెమెరాలను బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ చేశారు. ర్యాలీలో మఫ్టీ పోలీసులు, టాస్క్ ఫోర్స్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులతో సెక్యూరిటీ పెట్టారు. కమాండ్ కంట్రోల్ నుంచి వచ్చే సమాచారం తెలుసుకునేందుకు హై ఫ్రీ-క్వెన్స్  వైర్ లెస్ సెట్లను ఎస్సై స్థాయి అధికారికి అందించారు. శోభాయాత్ర ప్రారంభం నుంచి ముగిసే దాకా సీపీ అంజనీకుమార్, అదనపు సీపీ క్రైమ్స్ షికా గోయల్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్, డీఎస్ చౌహన్ ర్యాలీ పర్యవేక్షించనున్నారు. దీంతో పాటు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 వరకుజంట నగరాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ సీపీ ఆదేశాలు జారి చేశారు. శోభాయాత్ర అంతా సిటీలోని ప్రధాన రూట్లలో జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గౌలిగూడ,కోఠి, నారా యణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, కవాడి గుడా, రాణిగంజ్, ప్యారడైజ్, ఇం-పీరియల్ గార్డెన్స్, తాడ్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాన రూట్లలో జరిగే ర్యాలీకి బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. శోభాయాత్రలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకు న్నారు.యాత్రలో పాల్గొనే వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుతించరు.

ట్రాఫిక్ ఆంక్షలు:-

గౌలిగూడ నుంచి నారాయణగూడ రూట్ లో

 • అఫ్జల్ గంజ్, సాలార్ జంగ్ బ్రిడ్జ్ నుంచి పుత్లిబౌలీ వైపు వచ్చే వాహనాలు.. గౌలిగూడ చమాన్ మీదుగా, బీఎస్ఎన్ఎల్, సీబీఎస్ వైపు వెళ్లాలి.
 • ఆంధ్రా బ్యాంక్, రంగ్ మహల్ నుంచి గౌలిగూడ చమాన్ వైపు వచ్చే వాహనాలను..పుత్లిబౌలి క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్లాలి.
 • రామ్ మందిర్ నుంచి ర్యాలీ ప్రారంభమయ్యాక.. ఛాదర్ ఘట్ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చేవాహనాలు సీబీఎస్ మీదుగా వెళ్లాలి
 • శోభాయాత్ర పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రాబ్యాంక్ చేరుకున్న సమయంలో.. జీపీవోనుంచి వచ్చే ట్రాఫిక్ ఎంజే మార్కెట్ మీదుగా వెళ్లాలి
 • కోఠి ఆంధ్రా బ్యాంక్ జంక్షన్ కు ర్యాలీ చేరుకున్న సమయంలో.. ఛాదర్ ఘట్ నుంచి వచ్చే వాహనాలు సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లాలి
 • కాచిగూడ రైల్వే స్టేషన్ నుం చి వచ్చే ట్రాఫిక్..బడీచౌడి, బర్కత్ పురా, టూరిస్ట్ హోటల్ మీదుగా వెళ్లాలి.
 • బర్కత్ పుర చమన్ నుం చి వచ్చే ట్రాఫిక్.. ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ క్రాస్ రోడ్స్, క్రౌన్ కేఫ్, కాచిగూడ ఎక్స్ రోడ్స్ వైపు వెళ్లాలి.

నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో

 • అజామాబాద్ నుంచి వచ్చే కోటి వైపు వచ్చేట్రాఫిక్.. వీఎస్టీ క్రాస్ రోడ్స్ మీదుగా
 • ముషీరాబాద్ ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చేట్రాఫిక్.. మెట్రో కేఫ్ వద్ద రాం నగర్ టి జంక్షన్ వైపు
 • హిమాయత్ నగర్ జంక్షన్ నుం చి నారాయణగూడ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్.. హెచ్ పీపెట్రోల్ పంప్, నారా యణగూడ ఫ్లై ఓవర్మీదుగా కాచిగూడ వైపు
 • క్రౌన్ కేఫ్ నుంచి వచ్చే ట్రాఫిక్.. నారాయణగూడ ఫ్లై ఓవర్ మీదుగా..
 • కింగ్ కోటి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే ట్రాఫిక్.. ఈడెన్ గార్డెన్స్, శ్మశానం వద్ద మళ్లింపు
 • కర్బాల మైదానం నుంచి వచ్చే ట్రాఫిక్..సెయిలింగ్ క్లబ్ టి జంక్షన్, చిల్డ్రన్ పార్కువైపు
 • లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ నుంచి వచ్చే వాహనాలు.. డీబీఆర్ మిల్స్ అప్పర్ ట్యాం క్ బండ్ మీదుగా..
 • ముషీరాబాద్ ఎక్స్ రోడ్స్ నుంచి కవాడిగూడవైపు వచ్చే వాహనాలు.. గాంధీనగర్ ప్రాగటూల్స్ టి జంక్షన్ వద్ద మళ్లిం చారు.
 • కింగ్ కోటి నుంచి వచ్చే వాహనాలు.. బొగ్గులకుంట క్రాస్ రోడ్స్, బాటా క్రాస్ రోడ్స్, అబిడ్స్ మీదుగా మళ్లింపు
 • ఇక్బాల్ మినార్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు వచ్చే ట్రాఫిక్.. అంబేద్కర్ విగ్రహం చౌరస్తా నుం చి మళ్లింపు
 • ఇందిరా పార్క్ నుంచి అశోక్ నగర్ వైపు వచ్చే ట్రాఫిక్.. గగన్ మహల్, బంగారు మైసమ్మ మీదుగా వెళ్లాలి.

సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో

 • కర్బాల మైదాన్ నుంచి ఆర్పీ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్.. కర్బాల మైదాన్ క్రాస్ రోడ్ మీదుగా ఎంజీ రోడ్ రాణిగంజ్ వైపు
 • అడ్వయ్యా క్రాస్ రోడ్స్ లో వాహనాలకు అనుమతి లేదు
 • ట్యాంక్ బండ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు.. కర్బాల మైదాన్ వద్ద రాణిగంజ్, మినిస్టర్ రోడ్స్ వైపు మళ్లింపు
 • టివోలి క్రాస్ రోడ్స్ నుంచి బాలిమరి వైపు వచ్చే ట్రాఫిక్.. ఎన్ సీసీ క్రాస్ రోడ్స్, నార్నె ఎస్టేట్ వద్ద దారి మళ్లింపు
 • సీటీవో నుంచి బాలంరాయి వైపు వచ్చే ట్రాఫిక్.. లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాం డ్ క్రాస్ రోడ్స్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ వైపు మళ్లింపు
 • ఎన్ సీసీ క్రాస్ రోడ్స్ నుంచి డైమండ్ పాయింట్ వైపు వచ్చే ట్రాఫిక్.. నార్నేఎస్టేట్ పాయింట్ వద్ద కార్ఖాన బస్తీ వైపు మళ్లింపు
 • బాపూజీ నగర్ నుంచి, తాడ్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్.. సెంటర్ పాయింట్ మీదుగా డైమండ్ పాయింట్ కార్ఖాన వైపు మళ్లిం పు
 • మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలు.. సేఫ్ ఎక్స్ ప్రెస్ మీదుగా బాపూజీ నగర్ బోయనపల్లి మార్కెట్ వైపు మళ్ళింపు
 • బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్.. బోయినపల్లి ఎక్స్ రోడ్స్ మీదుగా సేఫ్ ఎక్స్ ప్రెస్ – బాపూజీ నగర్-బోయినపల్లి మార్కెట్ వైపు మళ్లించారు.

స్పెషల్ ఫోర్స్.. నిఘా

‘శోభాయాత్రలో పాల్గొనే యువత ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించాలి. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి. యాత్ర పొడవునా మౌంటెడ్ కెమెరాలతో నిఘా పెట్టాం. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించాం. పుకార్లను నమ్మొద్దు . ర్యాలీలోకి ఇతర వాహనాలను అనుమతించం. ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయి.’ – అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ.

 

 

Latest Updates