థియేటర్‌లోకి బయటి ఫుడ్ తీసుకెళ్లొచ్చు: అడ్డుకుంటే ఏం చేయాలి?

  • ఆర్టీఐ పిటిషన్‌కు సమాధానం చెప్పిన హైదరాబాద్ సిటీ పోలీస్

థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు సినిమా చూడడానికి వెళ్లినప్పుడు అక్కడ స్నాక్స్ కొందామంటే రేట్లు భారీగా ఉంటాయి. వాటర్ బాటిల్ కొనాలన్నా బయటి ఉండే ధరకు డబుల్ ఉంటుంది. పోనీ బయటనే ఏవైనా కొని తెచ్చుకుందామా అంటే.. గేట్‌లోనే వాటిని అడ్డుకుంటారాయే! లోపలికి బయట కొన్న ఫుడ్స్ ఏమీ తీసుకెళ్లడానికి లేదని చెబుతారు ఆ థియేటర్లు, మల్టీప్లెక్స్ వాళ్లు. ఇది ఏమైనా చట్టం ప్రకారం జరుగుతోందా? లేక వాళ్ల ఇష్టానికి ఇలా చేస్తున్నారా అన్న దానిపై హైదరాబాద్‌కు చెందిన యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్ విజయ్ గోపాల్ సమాచార హక్కు (RTI) కింది పిటిషన్ వేశాడు. హైదరాబాద్ సిటీ పోలీసులకు పెట్టిన ఆ పిటిషన్‌కు వాళ్లు స్పందించారు. అలా స్నాక్స్ తీసుకెళ్లకూడదనే చట్టం ఏదీ లేదని చెప్పారు. అలాగే ఎక్కువ ధరలు వసూలు చేస్తే వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేయొచ్చని తెలిపారు.

చట్టం ఏం చెబుతోంది

సినిమా రెగ్యులేషన్ యాక్ట్-1955 ప్రకారం టికెట్ కొని థియేటర్‌లోకి వెళ్లే వాళ్లను బయటి ఫుడ్, స్నాక్స్, వాటర్ బాటిల్ తీసుకెళ్లకుండా ఆపే అధికారం ఎవరికీ లేదు. బయటి నుంచి ప్రేక్షకులకు నచ్చిన ఫుడ్ తెచ్చుకోకుండా ఆంక్షలు విధించే హక్కు థియేటర్లకు ఉండదు. ఎవరైనా అడ్డుకుంటే లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్ చేయొచ్చని హైదరాబాద్ సిటీ పోలీస్ తెలిపారు. ఆ డిపార్ట్‌మెంట్ అధికారులు చట్టం ఉల్లంఘనలపై చెక్ చేసి, చర్యలు తీసుకుంటారని చెప్పారు.

MORE NEWS:

భారత ముస్లింలు భయపడొద్దు

మగవాళ్లే ఇంట్లో కూర్చుంటే.. అమ్మాయిలు సేఫ్: మహిళ వీడియో వైరల్

ఐనాక్స్‌కి ఫైన్

రెండేళ్ల క్రితం ఐనాక్స్ మల్టీప్లెక్స్‌పై హైదరాబాద్ కన్‌జ్యూమర్ ఫోరం రూ.6 వేల ఫైన్ వేసింది. తన దగ్గర వాటర్ బాటిల్‌కు బయటి ధర కన్నా ఎక్కువ తీసుకున్నారని ఐనాక్స్‌పై విజయ్ గోపాల్ కంప్లైంట్ ఇచ్చాడు. దీనిపై సీరియస్ అయిన కన్‌జ్యూమర్ ఫోరం ఒకే వస్తువుకు రెండు రకాల రేట్లు వేసి అమ్మడం కరెక్ట్ కాదని ఐనాక్స్‌ని హెచ్చరించింది.

త్రీడీ గ్లాసులకి డబ్బు వసూలు చేయకూడదు

సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లు ఏవీ కస్టమర్ల దగ్గర నుంచి త్రీడీ గ్లాసెస్‌కు డబ్బులు వసూలు చేయకూడదని మరో ఆర్టీఐ పిటిషన్‌కు పోలీసులు రిప్లై ఇచ్చారు. అయితే ప్రభుత్వం పర్మిషన్ తీసుకున్న కొన్ని థియేటర్లకు డబ్బులు వసూలు చేసే రైట్ ఉంది. కానీ, కస్టమర్లు సొంతంగా త్రీడీ గ్లాసెస్ తెచ్చుకుంటే థియేటర్లు అడ్డుకోకూడదన్నది నిబంధన. ఈ కండిషన్‌ను ఉల్లంఘించినా లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్ ఇవ్వొచ్చు.

Latest Updates