హైదరాబాద్ లో 2 రోజుల్లో రూ.4.92 కోట్లు సీజ్

హైదరాబాద్ : ఎలక్షన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం. రూ. 29 కోట్లు సీజ్ చేశామన్నారు. తాజాగా… గడిచిన 2 రెండురోజుల్లోనే రూ.4కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

“లోక సభ ఎన్నికల నేపథ్యంలో కూడా భారీగా డబ్బును సీజ్ చేశాం. 48 గంటల్లో 8 పోలీస్ స్టేషన్ ల పరిధిలో రూ.4కోట్ల 92లక్షల 89వేలు సీజ్ చేశాం. ఈ డబ్బు ఎక్కడకు తీసుకెళ్తున్నారు.. ఎవరి సొంతం అనేదానిపై దర్యాప్తు చేస్తున్నాం. ఆదాయపు పన్ను శాఖకు ఈ డబ్బు అప్పజెబుతాం” అన్నారు సీపీ.

  • సోమాజిగూడ టాస్క్ ఫోర్స్ రైడ్స్ లో రూ.26 లక్షల 19 వేలు సీజ్ –ఇద్దరు అరెస్ట్
  • నార్త్ జోన్ మూసారాంబాగ్ లో ఓ కారులో రూ.34 లక్షల 30 వేలు నగదు సీజ్
  • బంజారాహిల్స్ టయోటా కారులో రూ.కోటి రూపాయలు స్వాధీనం
  • నార్త్ జోన్ బసవతారకం ఆస్పత్రి దగ్గర ఇనోవా కారులో రూ.2.6 కోట్లు డబ్బులు సీజ్
  • 8 పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.4 కోట్ల 92 లక్షల 89 వేలు నగదు సీజ్

Latest Updates