మట్టి గణపతులకే జై కొడదాం

తాండూరు, వెలుగుపర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటు పడాలని, మట్టితో తయారు చేసిన గణపయ్యలనే పూజిద్దామని తాండూరు ఆర్డీవో వేణుమాధవరావు సూచించారు. పట్టణంలోని సాయిమేథ, ఆపిల్​ కిడ్స్​విద్యాలయాల్లో  శనివారం ఉచితంగా 300 మట్టి ప్రతిమలు, మొక్కలను చిన్నారులకు అందజేశారు.

కూకట్పల్లి: పర్యావరణానికి హాని కలిగించకుండా మట్టి గణేశులనే పూజించాలని కార్పొరేటర్​ మందాడి శ్రీనివాస్​ కోరారు. శనివారం కేపీహెచ్​బీ కాలనీ 114 వార్డు​కార్యాలయంలో మట్టి గణేశ్ విగ్రహాలను పంపిణీ చేశారు.

జీడిమెట్ల:  సూరారంకాలనీలోని ప్రభుత్వ పాఠశాల వి పతిని ఇంటి వద్దనే కరిగిద్దాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.

జీడిమెట్ల:  పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని  కాలుష్య నియంత్రణ మండలి ఏఈఈ శరత్​ చంద్ర అన్నారు. అపురూపకాలనీలోని టీవీఆర్​ హైస్కూల్​లో శనివారం విద్యార్థులకు ఉచితంగా వినాయక మట్టివిగ్రహాలను పంపిణీచేశారు.

షాద్ నగర్: మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని సరస్వతి శిశుమందిర్ హైస్కూల్ ప్రబంధకారిణి అధ్యక్షుడు వి.విజయ్ కుమార్ అన్నారు. శనివారం షాద్ నగర్ సరస్వతి శిశుమందిర్ హైస్కూల్ లో 100 మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేశారు.  హెచ్ఎం డి.అలివేలు ఉన్నారు.

చందానగర్ : చందానగర్ గాంధీ విగ్రహం వద్ద తెరాస నాయకులు  వెంకట్ రావు ఆధ్వర్యంలో మట్టివినాయక ప్రతిమలను  ఎమ్మెల్యే గాంధీ  ప్రజలకు అందజేశారు.

శంషాబాద్:  పెద్ద షాపూర్ లోని ఎస్ వీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో  గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ శాంతి సమావేశం నిర్వహించారు. సర్పంచ్ చంద్రశేఖర్, తండా సర్పంచి, తదితరులు పాల్గొన్నారు.

గీతంలో ఎకో గణేశ్ పోటీలు

పటాన్‌‌చెరు: గీతం యూనివర్శిటీలో ఎకో గణేశ్ పేరిట జరిగిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని గణేశ్ విగ్రహాలను తయారు చేశారు. ఎన్ఎస్ఎస్​ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల మట్టి గణేశులను ప్రదర్శించారు.అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

గవర్నర్కు ఎకో గణపతి విగ్రహం అందజేత

జయశంకర్ అగ్రి వర్శిటీ ఉపకులపతి ప్రవీణ్​రావు శనివారం నగరంలోని రాజ్​భవన్ లో  గవర్నర్​నర్సింహన్​ను కలిసి ఎకో గణపతి ప్రతిమను అందజేశారు. కొన్నేళ్లుగా పీసీబీతో కలిసి వర్శిటీ ఆధ్వర్యంలో చెట్ల బెరడు, పువ్వులు, కొమ్మల నుంచి తీసిన రంగులతో ఎకో గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నామని గవర్నర్ కు వివరించారు.

పటాన్‌‌చెరు: కుమ్మరులకు జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో పటాన్​చెరు కుమ్మర సంఘం, బీసీ అభివృద్ధి జిల్లా అధికారి కేశురాం ఆధ్వర్యంలో పటాన్​ చెరులో మట్టి గణేశుల విగ్రహాల ప్రదర్శన, అమ్మకాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి ప్రారంభించారు. .

శంషాబాద్:  పట్టణంలోని హోటల్స్, షాప్స్ లలో  మట్టి ప్రతిమలనే ప్రతిష్టించుకోవాలని మున్సిపల్​ కమిషనర్ చాముండేశ్వరి సూచించారు.  అవగాహన కల్పించేలా కరపత్రాలు, మట్టి విగ్రహాలను ఆమె పంపిణీ చేశారు.

వికారాబాద్ : జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ ఆవరణంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పట్నం సునీతరెడ్డి ఆధ్వర్యంలో 3 వేల మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు.

కీసర : నాగారం మున్సిపాలిటీ పరిధిలోని విజ్ఞాన్ బో ట్రీ స్కూల్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల గురించి విద్యార్థులు అవగాహన కల్పిస్తూ దమ్మాయిగూడ నుంచి నాగారం వరకూ ర్యాలీ నిర్వహించారు.

ఎల్బీనగర్: ఎకో ఫ్రెండ్లీ గణేశ్ నే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్​విద్యార్థులు వాహనదారులకు అవగాహన కల్పించారు.

సైఫాబాద్: హైదరాబాద్ మెట్రో పాలిటెన్ డెవలెప్‍మెంట్  అథారిటీ ( హెచ్.ఎమ్.డి.ఏ ) ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.  ట్యాంక్‌‌బండ్ పై ఉన్న హెచ్‌‌ఎండీఏ  కార్యాలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసే వాహనాలను అధికారులు ప్రారంభించారు.

Latest Updates