అప్పు చెల్లించలేదని కిడ్నాప్ చేసి కొట్టిన హైదరాబాద్ కార్పొరేటర్

అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. హరిపురి కాలనీకి చెందిన యారాసింగ్ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి.. బోడుప్పల్ 6వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ అజయ్ యాదవ్‌ దగ్గర కొన్ని నెలల క్రితం అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు చెల్లించాలని దుర్గాప్రసాద్‌ని అజయ్ యాదవ్ కోరాడు. అయితే కరోనా వల్ల దుర్గాప్రసాద్ డబ్బులు చెల్లించలేకపోయాడు. దాంతో కోపోద్రిక్తుడైన అజయ్.. తన స్నేహితులైన మంగినపల్లి సాయికుమార్, చంద్రారెడ్డిలతో కలిసి ఈ నెల 12న రాత్రి దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చి బలవంతంగా కార్‌లో తీసుకెళ్లి కొట్టారు. అజయ్ యాదవ్, అతని స్నేహితులు.. డబ్బు చెల్లించాలని బెదిరిస్తూ సిటీలో పలుచోట్ల తిప్పుతూ కొట్టారని దుర్గాప్రసాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం రాత్రి కార్పోరేటర్ అజయ్ యాదవ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

For More News..

తెలంగాణలో మరో 2,058 కరోనా కేసులు

సుప్రీంకోర్టుకు రూపాయి ఫైన్‌‌ కట్టిన ప్రశాంత్‌ భూషణ్

Latest Updates