హైదరాబాద్‌లో విషాదం.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న దంపతులు

హైదరాబాద్ : నగరంలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. బీఎన్ రెడ్డి నగర్ కి చెందిన వెంకటరెడ్డి దంపతులు ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమ‌ చావుకు ఎవరూ కారణం కాదంటూ ఓ సూసైడ్ లెటర్ కూడా  రాశారు.

జీవించడానికి ఇష్టం లేకనే చనిపోదామని నిర్ణయించుకున్నామని దంపతులు వెంకట్ రెడ్డి, నిఖిత లు ఆ లెటర్ లో తెలిపారు. దయచేసి ఎవరూ బాధపడొద్దని, చివరి కోరికగా తమ కొడుకును జాగ్రత్తగా చూడాలిని అందులో కోరారు.

ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు.

Latest Updates