అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ దంపతులు మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. మృతులు ఆవుల దివ్య, రాజా గవిని గా పోలీసులు గుర్తించారు. దంపతులతో పాటు ప్రేమ్‌నాథ్ రామనాథం అనే వ్యక్తి కూడా మరణించాడు. వీరంతా టెక్సాస్ రాష్ట్రం ప్రిస్కో పట్టణంలో నివసిస్తున్నారు.  అతివేగంగా వస్తున్న కారు మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. ప్రమాదంలో దివ్య ఆవుల, రాజా గవిని అక్కడికక్కడే మృతి చెందారు.

హైదరాబాద్ లోని ముషీరాబాద్ వారి స్వస్థలం. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

నిన్న సాయంత్రం 6.30 కు ప్రమాదం జరిగినట్లుగా మంగళవారం ఉదయం సమాచారం వచ్చిందని దివ్య తండ్రి గౌతమ్ మీడియాతో అన్నారు. ఇటీవలే తన కూతురు కుటుంబం డల్లాస్ కు మారిందని, ఇల్లు కొనేందుకు ఒకచోటకి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. కూతురు దివ్యతో పాటు, అల్లుడు రాజా, అతని స్నేహితుడు ప్రేమ్ నాథ్ లు ఈ ప్రమాదంలో చనిపోయారని  గౌతమ్ చెప్పారు.

 

 

Latest Updates