కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ అంజనీకుమార్

కరోనావైరస్ సోకి చనిపోయిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ రెండు నిమిషాలు మౌనం పాటించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని కులసుం పురా పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దయాకర్ రెడ్డి చిన్న వయసులోనే కరోనావైరస్‌తో చనిపోవడం చాలా బాధగా ఉందని ఆయన అన్నారు. సీపీ కులసుం పురా పోలీస్ స్టేషన్‌లో సేఫ్టీ ప్రికాషన్స్‌ను పరిశీలించారు.

‘దయాకర్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. దయాకర్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఆయన భార్యకు ఉద్యోగం కల్పించడంతో పాటు.. వారి పిల్లలను ఆదుకుంటాం. ఈ క్రైసిస్‌లో అందరం కరోనావైరస్‌తో పోరాడుతున్నాం. పోలీస్ డిపార్ట్‌మెంట్ కరోనా వారియర్ పని చేస్తుంది. పోలీసులందరూ 24 గంటలు కరోనావైరస్ నియంత్రణ కోసం పని చేస్తున్నారు. ముంబయిలో 900 మంది పోలీసులకు కరోనావైరస్ వచ్చింది. ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రతి రెండు గంటలకొకసారి చేతులను శానిటైజర్‌తో కడుక్కోవాలి. పోలీసులు ప్రజలతో మమేకమై డ్యూటీలు చేయాలి కాబట్టి పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్లులు, శానిటైజర్స్ వాడుతూ భౌతికదూరం పాటించాలి’ అని ఆయన అన్నారు.

For More News..

పాక్ విమాన ప్రమాదం.. ఏటీసీతో పైలట్ చివరి మాటలు

పబ్లిక్ టాయిలెట్‌లో ఉరేసుకున్న యువకుడు

రైతులు అధికారుల దగ్గరకి వెళ్లడం కాదు.. అధికారులే రైతుల దగ్గరకి వెళ్ళాలి

Latest Updates