ఆ ప్రాధాన్యతను ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే: సీపీ అంజనీకుమార్

Hyderabad CP Anjanikumar meets police training students in Secunderabad

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం మొట్ట మొదటి ప్రాధాన్యత పోలీస్ వ్యవస్థకే ఇచ్చిందని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని కె జె ఆర్ గార్డెన్ లో పోలీస్ అర్హత శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను సీపీ కలిశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్,సౌత్ జోన్, నార్త్ జోన్, వనపర్తి కి చెందిన దాదాపు 1000మంది విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

అక్కడ నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీ శాంతి యుత నగరం గా ఉండాలన్నా, విదేశీ పెట్టుబడులు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, పర్యాటక నగరంగా మారాలన్నా మొదట కావలసింది భద్రత, రక్షణ అని అన్నారు. పటిష్టమైన భద్రత,రక్షణ పోలీస్ వ్యవస్థ ఉంటేనే సాధ్యమని,  దానికి పోలీసులే కీలకం అని అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి మొట్ట మొదటి ప్రాధాన్యత  పోలీసులకు ఇచ్చిందని సీపీ అన్నారు.  ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న నార్త్ జోన్ డీసీపీ కలమేశ్వర్, కార్ఖానా ఇన్స్పెక్టర్ మదుకర్ స్వామి, భాగ్య కిరణ్,  స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను కమీషనర్ అంజనీకుమార్ అభినందించారు

Latest Updates