కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ

  • మౌంట్ కిలిమంజారోపై మన ఐపీఎస్
  • ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన జాయింట్ సీపీ తరుణ్ జోషి 

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ తరుణ్‌‌ జోషి ఆఫ్రికాలోనే ఎత్తైన కిలిమంజారో అగ్ని పర్వతాన్ని అధిరోహించారు. టాంజానియాలోని మౌంట్‌‌ కిలిమంజారోపై జాతీయ జెండాతో పాటు సిటీ పోలీస్ ఫ్లాగ్‌‌ ను ఆయన ఎగురవేశారు. లోకల్ టైం ప్రకారం శుక్రవారం ఉదయం 8.15 గంటలకు ఆయన 5,895 మీటర్ల ఎత్తు ఉన్న కిలిమంజారో శిఖరానికి చేరుకున్నారు. తరుణ్‌‌ జోషిని సీపీ అంజనీకుమార్‌‌‌‌తో పాటు పోలీస్‌‌ ఉన్నతాధికారులు అభినందించారు. 2004 ఐపీఎస్‌‌ బ్యాచ్‌‌కి చెందిన తరుణ్‌‌ జోషీకి మౌంటైన్ క్లైంబింగ్ అంటే చాలా ఇష్టం.

కిలిమంజారో ఎక్కిన భువనగిరి స్టూడెంట్

ఆఫ్రికా ఖండంలో ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని (5,895 మీటర్లు) యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన స్టూడెంట్ పడమటి అన్వితా రెడ్డి ఎక్కారు. హైదరాబాద్​లోని ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న పడమటి మధుసూదన్​రెడ్డి కూతురు అన్వితా రెడ్డి.. భువనగిరిలోని రాక్​ క్లెంబింగ్​ స్కూల్లో ట్రైనింగ్ పొందారు. ఈ నెల 15న స్పెషల్​ బ్రాంచ్​ జాయింట్​ పోలీస్​ కమిషనర్​ తరుణ్​ జోషితో కలిసి కిలిమంజారో పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించి 21 నాటికి పర్వతం పైకి చేరుకున్నారు.

For More News..

మా బతుకులతో ఆడుకుంటున్నరు.. నర్సింగ్​ అభ్యర్థుల ఆందోళన

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

Latest Updates