కులుమనాలి లో హైదరాబాద్  డాక్టర్ మృతి

hyderabad-doctor-dies-after-parachute-fails-in-kullu-manali

విహార యాత్రలో విషాదం జరిగింది. స్నేహితులతో కలసి హిమచల్ ప్రదేశ్ కులుమనాలికి వెళ్లిన హైదరాబాద్ వాసి దురదృష్ట వశాత్తు మరణించాడు. ప్యారచుట్ వేసుకొని గాల్లో విహరిస్తుండగా.. ప్రమాదశాత్తూ  ఆ ప్యారచుట్  తెగిపడడంతో అక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ నాగోల్ కు చెందిన లక్కా చంద్రశేఖర్ రెడ్డి(24) ECIL  లోని శ్రీకర్ హాస్పిటల్స్ లో  డాక్టర్ గా పనిచేస్తున్నాడు. నంద్యాల పక్కన కొత్త పల్లె గ్రామానికి చెందిన చంద్ర శేఖర్ రెడ్డి కుటుంబం గత కొంత కాలంగా నాగోల్ లోని సమత పూరి కాలనీ లో నివాసం ఉంటోంది. ఫిజియోథెరపీ పూర్తి చేసి ఇటీవలే శ్రీకార ఆస్పత్రి లో ఉద్యోగం చేస్తున్న చంద్ర శేఖర్.. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి కులు మనాలి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమాదం లో మృతి చెందాడు. చంద్ర శేఖర్ రెడ్డి మృతి తో ఆ కుటుంబంలో, ఆ కాలనీలో విషాద ఛాయలు ఆలుముకున్నాయి

Latest Updates