నిందితుల మృతదేహాలు ఆసుపత్రిలోనే

మహబూబ్ నగర్: దిశ కేసు ఎన్ కౌంటర్ లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించటం లేదని మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మార్చూరీలో మృతదేహాలను ఉంచేందుకు ఫ్రీజర్లను  సిద్దం చేసినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. రేపు మహబూబ్ నగర్ కు జాతీయ మానవ హక్కుల కమీషన్ బృందం వచ్చే అవకాశం ఉన్నందున శవాలను ఈ రోజు ఖననం చేయకుండా ఆపినట్లు తెలుస్తోంది.

మృతదేహాలకు ఈ రాత్రి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు సూచించగా.. మృతుల కుటుంబసభ్యులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు ఖననం చేసుకుంటామని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఒక మృతదేహానికి మాత్రమే పోస్టుమార్టం నిర్వహించారు. మిగతా మూడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యేటప్పటికి రాత్రి 11 గంటలు అవుతుందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

Latest Updates