హైదరాబాద్‌ కు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు

Hyderabad gets swachata excellency award

Hyderabad gets swachata excellency awardహైదరాబాద్‌‌‌‌, వెలుగు: భాగ్యనగరానికి స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్సలెన్స్ అవార్డు దక్కిం ది. 10 లక్షలకు పైగా జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ కు మాత్రమే ఈ పురస్కారం లభించింది. దీనిపై నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్‌‌‌‌ దాన కిశోర్‌‌‌‌ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో స్వచ్ఛత కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు లభించిందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నా రు. పది రోజుల వ్యవధిలోనే మహానగరానికి రెండు గుర్తింపులు లభించడం సంతోషకరమని కిశోర్‌‌‌‌ చెప్పారు.
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్‌‌‌‌ 2019 లోను మంచి ర్యాంకింగ్ సాధిస్తామని తెలిపారు. జనవరిలో హైదరాబాద్ ను ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ గా స్వచ్ఛ భారత్ మిషన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Latest Updates