శాంతి భద్రతల్లో మనమే నంబర్ వన్

శాంతి భద్రతల్లో దేశంలో వరుసగా నాలుగోసారి హైదరాబాద్ మొదటి స్థానం సాధించిందని, దీనికి పెట్రోలింగ్ అధికారుల కృషి ఎంతోఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. శనివారం నిజాం కాలేజీగ్రౌండ్స్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమసేవలందించిన పెట్రోలింగ్ అధికారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా సిటీలోని 122పెట్రోలింగ్ వాహన అధికారులతో ఇంటరాక్ట్అయ్యారు. చురుకుగా పనిచేసిన వారిని, ఎమర్జెన్సీలో త్వరగా స్పందించి, మంచి పనితనం, పబ్లిక్ తో మర్యాదగా నడుచుకున్న అధికారులకు పోలీస్ స్టేషన్ల వారీగా ప్రశంసాపత్రాలు అందజేశారు. వీరిలో మలక్ పేట్, లంగర్ హౌస్,నాం పల్లి, నల్లకుం ట, మహంకాళి, జూబ్లీహి ల్స్,ఆసిఫ్ నగర్, పంజాగుట్ట, లాలాగుడా, గోపాలపురం, కలాపథర్, బోయిన్ పల్లి, తిరుమలగిరి,చాంద్రయాన్ గుట్ట, నాం పల్లి, సుల్తాన్ బజార్,బంజారాహి ల్స్, చార్మినార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మాదన్నపెట్, బహదూర్ పురాస్టేషన్ల అధికారులున్నారు. కార్యక్రమానికి సిటీసీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ కమిషనర్ టి.మురళి కృష్ణ హాజరయ్యారు.

పెట్రోలింగ్ అధికారుల బాధ్యతలు

  • అన్ని రకాల అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా హాజరుకావడం.
  • నేర నిరోధానికి ముందస్తు చర్యలు చేపట్టడం.
  • పీఎస్ పరిధిలో పాత నేరస్తుల నివాసాలను, వారి నడవడికను రెగ్ యులర్ గా చెక్ చేయడం, నిరంతర నిఘా పెట్టడం.
  • సకాలంలో నేర నివారణ కోసం క్రిమినల్ ఇంటెలిజెన్స్ ను సంప్రదించడం.
  • పోలీసుల ఇమేజ్ మెరుగుపరిచేందుకు కమ్యూనిటీ పోలీస్ కార్యకలాపాలను నిర్వహించడం.
  • ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం.
  • సిటీలోని122 పెట్రో కార్స్ ఘటన స్థలానికి చేరుకునేందుకు పట్టే సగటు సమయం సుమారు 7 నిమిషాలు.

Latest Updates