చెట్లను చంపేస్తున్నారు – బల్దియా హెడ్డా ఫీస్‌

సిటీలో ఫుట్‌ పాత్‌ లపై, రోడ్లకు ఇరువైపులా మోడు వారి, ఎండిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి. ఇందులో చాలావరకు పెరుగుదల ఆగిపోయి కూలిపోతున్నాయి. కానీ దీని గురిం చి జీహెచ్‌ ఎంసీ ఆలోచిం చడం లేదు. ఫుట్‌ పాత్‌ లను అభివృద్ధి చేస్తున్నా వాటిపై ఉన్నచెట్ల చుట్టూ స్థలం వదలడం లేదు. సిమెంట్‌ , కాం క్రీట్‌ తో మూసేస్తుం డడంతో నీళ్లు తీసుకునే దారి లేకప్పకూలుతున్నాయి. బల్దియా హెడ్డా ఫీస్‌ మెయిన్‌ గేటుముందే చెట్ల పరిస్థితే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల సంగతి చెప్పక్కరలేదు.

టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం మొక్కల పెంపకానికి చాలా ఇంపార్టెన్స్‌ ఇచ్చింది. దీనికోసం హరితహారం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో అన్ని డిపార్ట్‌‌‌‌‌‌‌మెంట్స్‌ ఇన్‌‌‌‌‌‌‌వాల్వ్‌‌‌‌‌‌‌‌ అయి మొక్కలను నాటాయి.ఇందులో జీహెచ్‌ ఎంసీ పాత్ర చాలా గొప్పది. కానీ మొక్కల పెంపకంపై ప్రచారం చేస్తున్న ఈ శాఖ చెట్ల గురించి మాత్రం పట్టిం చుకోవడం లేదు. సిటీలోని ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్‌ లపై 60 వేల చెట్లు ఉంటాయనేది అంచనా.అయితే ఫుట్‌‌‌‌‌‌‌పాత్‌ ల అభివృద్ధి కోసం జీహెచ్‌ ఎంసీ చేస్తున్న పనులు అవి చనిపోయేందుకు కారణమవుతున్నా యి. చెట్ల చుట్టూ కొంత స్థలం కూడా వదలకుండా కాంక్రీటుతో నిం పేస్తున్నా రు. దీం తో నీరు లోపలికి
ఇంకే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా చెట్ల ఎదుగుదల ఆగిపోయి, మోడువారుతున్నాయి.వర్షం వచ్చి గాలి వీస్తే వెంటనే కూలిపోతున్నా యి. జీహెచ్‌ ఎంసీలోని బయో డైవర్సిటీ విభాగం మొక్కలు నాటుతుం ది. ఫుట్‌‌‌‌‌‌‌పాత్‌ ల అభివృద్ధి ని మెయిం టెనెన్స్‌
ఇంజినీరింగ్‌ విభాగం చూస్తుంది. ఎవరి పని వాళ్లు చేస్తుండడంతో చెట్లు కూలిపోతున్నా యి. నగరంలోని చాలా ప్రాం తాల్లో ఇండ్లు, దుకాణాల ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.కోట్లలో ఖర్చు..ఏటా చెట్ల పెంపకానికి రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాటి నిర్వహణ, నీటి సరఫరా ద్వారా భారీగానే ఖర్చవుతున్నది. కానీ అధికారులు త్వరగా పె రగాలనే కారణంతో కొన్ ని రకాల మొక్కలను నాటుతున్నారు. ఆ తర్వా త పర్యవేక్షించడం లేదు. సాధారణంగా 7-8 రోజులకు ఓ సారి, ఎండాకాలంలో 4-5 రోజులకు ఓ సారి చెట్లకు నీరు పెట్టా లి. కానీ చెట్లు పీల్చుకోలేని విధంగా వాటి మొదళ్లు ఉన్నాయి.

ఇలా చేయొచ్చు..మెట్రోరైల్‌ స్టేషన్ల వద్ద ఆర్టీసీ బస్టాప్‌ లనుతీర్చిద్దు తున్నారు. ఫుట్‌ పాత్‌ లపై ఉన్న చెట్ల చుట్టూ కొంత స్థలం వదులుతున్నారు. చెట్లకు దిమ్మెలను కూడా నిర్మిస్తు న్నారు. దీంతో చెట్టు కు పూర్తి రక్షణ ఉండడమే కాకుండా ఎదుగుదలకు అవకాశం ఉంది. ఒకసారి జీహెచ్‌ ఎంసీ అధికారులు మెట్రో స్టేషన్లను పరిశీలించి, ఫుట్‌ పాత్‌ లపై ఉన్న చెట్లకు కూడా ఆ విధంగా చేస్తే ఎంతో బెటర్‌ గా ఉంటుంది.

Latest Updates