హైదరాబాద్ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం

హైదరాబాద్ కు మరో టెక్ దిగ్గజం వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వన్ ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్ ను  TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వన్ ప్లస్ సిఇఒ పీట్ లూ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని KTR పారిశ్రామికవేత్తలను కోరారు. హైదరాబాద్‌లో వన్ ప్లస్ రూ.1000 కోట్లు పెట్టబడి పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో 3వేల ఉద్యోగాలు రావడం శుభ పరిణామమని తెలిపారు. వన్ ప్లస్ మాన్యు ఫాక్చర్ యూనిట్ ను కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి KTR కోరారు. తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు కేటీఆర్.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నామని వన్ ప్లస్ CEO పీట్ లూ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాల అనుకూలంగా ఉందన్నారు.

Latest Updates