సిటీలో డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెల్స్..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతున్న కరోనా పాజిటివ్​ కేసులు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో కరోనా డేంజర్​ బెల్స్ ​మోగిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్​ కేసులు పెరిగిపోతున్నాయి. వారం క్రితం అతి తక్కువగా 3 కేసులు నమోదవ్వడంతో కంట్రోల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. కానీ.. శనివారం 31, ఆదివారం 33, సోమవారం 79, మంగళవారం 37 మందికి పాజిటివ్ వచ్చింది. 24 గంటల్లో 100కిపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అదికూడా స్పెసిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాల నుంచే. ప్రభుత్వం, బల్దియా అనాలోచిత నిర్ణయాలు, ప్రైమరీ కాంటాక్ట్​లకూ టెస్ట్​లు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని కొందరు అధికారులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాటికి గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసుల సంఖ్య 767కి చేరింది.

చూస్తుండగానే...

వారం క్రితం కరోనా పాజిటివ్​ల సంఖ్య తగ్గడంతో సిటిజన్స్​ ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే చాప కింద నీరులా వైరస్ ​ స్ర్పెడ్ ​అవుతోంది. ఎల్​బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్లు హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పాట్స్​గా మారాయి. చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట, సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుమా, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిళ్లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అసిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భవానీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తలాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కట్టలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మర్కజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింకులు, లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్​ బ్రేక్ చేసిన​ కారణంగానే ఇక్కడ కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని ద్వారకానగర్, సాయినగర్, సచివాలయ కాలనీల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. నాగోల్, లింగోజిగూడ, హుడా సాయినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాలనీలో కేసులున్నాయి. చాలామందికి కరోనా ఎలా సోకిందనే లింక్ ​తెలియడం లేదు.

సర్వే సరిగ్గ చెయ్యకనేనా?

కరోనా సోకిన వారి లింకులు చాలా రోజుల వరకు బయటపడటం లేదు. ప్రైమరీ కాంటాక్ట్​లకు టెస్ట్​లు చేయకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్యారోగ్యశాఖ కార్యకర్తలు ఫీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే సరిగ్గా చేయలేదని అభిప్రాయపడ్డారు.

జియాగూడలో 39

ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్​ కార్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని జియాగూడలో వైరస్​ ఎక్కువగా స్ప్రెడ్​ అయింది. దుర్గానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాయిదుర్గానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంకటేశ్వర నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 39 కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులు 9 కంటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్లు ఏర్పాటు చేశారు. ప్రైమరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా సెకండరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల డీటెయిల్స్​సేకరిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు 48 మంది ప్రైమరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లను నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 64 కేసులు నమోదైతే, జియాగూడలోనే 39 ఉండటం తీవ్రతను తెలుపుతోంది.

చెప్పిన పంటేస్తేనే రైతు బంధు

Latest Updates