హైదరాబాద్ లో రియల్టీ స్టడీ గ్రోత్

హైదరాబాద్, వెలుగు: రియల్టీ సెక్టార్ లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మిగతా మెట్రో నగరాల్లో రియాలిటీ ఒడిదొడుకులను ఎదుర్కొంటే.. హైదరాబాద్ మాత్రం స్థిరంగా నిలుస్తోంది. పెరుగుతున్న పెట్టుబడులు, కంపెనీల రాకతో కొత్తగా నివాస, కమర్షియల్ సెగ్మెంట్లు దూసుకుపోతుండగా.. వేగంగా బిల్డింగ్ పర్మిషన్లు వచ్చే వ్యవస్థ ఏర్పాటుతో నిర్మాణ రంగానికి మరింత కలిసి వచ్చింది.

వేగంగా అనుమతులు

సిటీల్లో బిల్డింగ్ పరిష్మన్లు అనేవి పెద్ద సమస్య. ముఖ్యంగా త్వరగా జారీ అయ్యే విధానపరమైన నిర్ణయం రియాల్టికీ ఎంతగానో కలిసి వస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో డీపీఎంఎస్ ద్వారా త్వరగా అనుమతులు జారీ అవుతుండటం నిర్మాణ రంగానికి ఎంతగానో కలిసి వస్తోంది. బిల్డింగ్ పర్మిషన్ల ద్వారా గత ఏడాది డిసెంబర్ 24 నాటికి 16,801 బిల్డింగ్ పర్మిషన్ల ద్వారా జీహెచ్ఎంసీకి రూ.980 కోట్ల ఆదాయం వచ్చిందంటే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2018తో పోలిస్తే ఇది 130 కోట్లు ఎక్కువ. ఇది వెయ్యి కోట్లకు చేరనుంది. గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. స్థిరమైన ప్రభుత్వం, శాంతి భద్రతల సమస్యలు లేకపోవడం సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం నిర్మాణ రంగం ఊపందుకోవడానికి కారణం అవుతోంది. వీటిల్లో 1902 రెసిడెన్షియల్ అపార్టుమెంట్ల పరిష్మన్లు రాగా, 236 కమర్షియల్ బిల్డింగులకు నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.

జోరుగా రెసిడెన్షియల్ భవనాలు

సిటీలో పెరుగుతున్న ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాల నేపథ్యంలో ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో సిటీలోని అన్ని ప్రాంతాల్లోనూ జోరుగా రెసిడెన్షియల్ భవనాల నిర్మాణం జరుగుతున్నాయి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ రానుండగా…  ఈస్ట్ జోన్ ఏరియాల్లో ముఖ్యంగా ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్ పరిధిలో ఒక్క ఏడాదిలో 342 రెసిడెన్షియల్ బిల్డింగ్, 25 కమర్షియల్ బిల్డింగ్ పర్మిషన్లకు పర్మిషన్లు దక్కగా, 423 రెసిడెన్షియల్, 38 కమర్షియల్ బిల్డింగుల​తో  పర్మిషన్లతో శేరిలింగంపల్లి జోన్ టాప్ లో నిలిచింది. హయత్ నగర్ సర్కిల్ లో  2380 పర్మిషన్లు, 1511 పర్మిషన్లతో ఆల్వాల్ సర్కిల్,  1429 పర్మిషన్లతో కాప్రా, 869 పర్మిషన్లతో మల్కాజ్ గిరి తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

రియాల్టీలో హైదరాబాద్ సత్తా

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనూ సత్తా చాటుతోంది. దేశంలోని మోస్ట్ లివబుల్ సిటీల్లో గ్లోబల్ ఏజెన్సీల నుంచి ర్యాంకింగ్ లిస్టులో  చోటు దక్కించుకుంది.

Latest Updates