ఒక్క ఉంగరంలో 7,801 వ‌జ్రాలు.. హైదరాబాదీ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్

ఒక్క ఉంగరంలో 7,801 వ‌జ్రాలు అమ‌ర్చి హైదరాబాద్‌కు చెందిన ఓ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. జూబ్లీ హిల్స్‌లోని ‘ది డైమండ్ స్టోర్ బై చందూభాయి’ యజమాని కొట్టి శ్రీకాంత్… ‘ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం’ పేరుతో ఈ ఉంగరాన్ని తయారు చేశారు. అరుదైన పుష్పం బ్రహ్మ కమలాన్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన ఈ డైమండ్ రింగ్‌ను గత నెలలోనే ఆవిష్కరించారు. గత ఏడాది గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ కోసం ఈ ఉంగరాన్ని సబ్మిట్ చేశారు. అనేక రౌండ్లు వెరిఫికేషన్ ప్రక్రియ జరిపారు. ఒక రింగులో ఎక్కువ డైమండ్స్ పొదిగిన గిన్నీస్ రికార్డ్ ఈ ఉంగరానికి దక్కింది. ఈ ఉంగరానికి సంబంధించిన వీడియోను గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ పేజీలో పోస్ట్ చేశారు.

Latest Updates