క‌రోనా వైర‌స్‌తో కాలాప‌త్త‌ర్ ఏఎస్ఐ మృతి

హైద‌రాబాద్: న‌గ‌రంలో పాత‌బ‌స్తీ కాలాప‌త్త‌ర్ లో కరోనా వైరస్ తో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (53) మరణించారు. కాలాప‌త్త‌ర్ పీఎస్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న యూస‌ఫ్(54 ) తీవ్ర జ్వరం,ఊపిరి సమస్యలతో అనారోగ్యం పాల‌య్యారు. క‌రోనా టెస్టులు చేయ‌గా.. పాజిటివ్ అని నిర్ధార‌ణ కావ‌డంతో ఈ నెల 15న‌ హైద‌రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్ఐ పరిస్థితి విషమించడంతో సోమ‌వారం తుదిశ్వాస విడిచారు.

Latest Updates