తిరుమలలో హైదరాబాద్ వాసి ఆత్మహత్య

తిరుపతి: తిరుమలలో హైదరాబాద్ కు  చెందిన ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  హైదరాబాదు మల్కాజిగిరికి చెందిన శ్రీధర్ (40)  శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమల చేరుకున్నాడు.  వకుళామాత అతిథి గృహంలోని 511 నెంబర్ గదిని తీసుకున్నాడు.  ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో ఆందోళనతో టీటీడీ వారిని సంప్రదించారు. గదిని ఖాళీ చేయాల్సిన సమయం దాటినా.. తలుపులు కొట్టినా స్పందించ లేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే గది లోపల శ్రీధర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో వెంటనే బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిన్న తన మేనల్లుడితో కలిసి తిరుమల కు వెళ్లాలని టికెట్లు బుక్ చేసుకున్నాడు శ్రీధర్. అయితే అల్లుడికి ఆన్లైన్ క్లాసులు ఉండడంతో ఒంటరిగా తిరుమల వెళ్లాడు. శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతుడు శ్రీధర్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.

Read More News…

టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశారు.. అలరిస్తున్న ట్రైలర్

మొబైల్ డేటా వినియోగించాడంటూ తమ్ముడిని హత్య చేసిన అన్న

కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాతే  ప్రచారం చేయాలి

రీసెర్చ్ : అమ్మాయిలకు బట్టతల మన్మథులంటేనే ఇష్టం

Latest Updates