హైదరాబాద్: మగబిడ్డ పుట్టడం లేదని భార్యకు ట్రిపుల్ తలాక్

మగ బిడ్డను కనలేదని తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. భర్త ట్రిపుల్ తలాక్ చెప్పడంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. మెహ్రన్ బేగం అనే మహిళ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. అయితే తనకు మగపిల్లలు పుట్టడంలేదని తన భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని చెప్పింది. దీంతో పాటే అతను వేరే అమ్మాయిని పెండ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది. తనకు అన్యాయం చేసిన అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

Latest Updates