శ్రీలంక బాంబు పేలుళ్లలో హైదరాబాద్‌ వాసి మృతి

హైదరాబాద్ : శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి చనిపోయాడు. అమీర్ పేట నాగార్జుననగర్ కు చెందిన వేమూరి తులసీరామ్ అతని ఐదుగురు స్నేహితులు కలిసి శ్రీలంక టూర్ వెళ్లారు. అక్కడి హోటల్ లో ఉన్న సమయంలో పేలుడు జరగడంతో తులసిరామ్ అక్కడిక్కడే చనిపోయారు. మరో ఫ్రెండ్ శ్రీనివాస్ బాబుకి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల దాడిలో మృతుల సంఖ్య 321కి పెరిగింది. మొత్తం 500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Latest Updates