లండన్ లో హైదరాబాదీ యువకుడు దారుణ హత్య

లండన్ లో హైదరాబాదీ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చనిపోయిన వ్యక్తిని మహ్మద్ నజీముద్దీన్ గా గుర్తించారు. లండన్ లోని టెస్కో సూపర్ మార్కెట్ లో గత ఆరేళ్లుగా నజీముద్దీన్ పని చేస్తున్నట్లు తెలిసింది. సూపర్ మార్కెట్లో పని చేస్తున్న తోటి ఉద్యోగే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. సంచలనంగా మారిన ఈ ఘటన బుధవారం జరిగింది. నజీముద్దీన్ డ్యూటీ తర్వాత ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

దీంతో మేనేజర్ సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. సెల్లార్ లోని కార్ పార్కింగ్ దగ్గర కత్తిపోట్లకు గురైనట్లు గుర్తించారు. నజీముద్దీన్ భార్య లండన్ లోనే డాక్టర్ గా పని చేస్తున్నారు. నజీముద్దీన్ కు యూకే పౌరసత్వం కొద్ది రోజుల్లో వస్తుందనగా ఈ దారుణం జరిగింది. నజీముద్దీన్ బంధువులు లండన్ వెళ్లేందుకు సహకరించాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీని కోరారు. మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు.

Latest Updates