మీకోసం కేసీఆర్ తో మాట్లాడి…ఇళ్లు కట్టిస్తా

హైదరాబాద్ లో భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ  నీట మునిగి కుప్ప కూలిపోయాయి. దీంతో అనేక మంది ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. అయితే అలాంటి వారికి ప్రభుత్వం తరుపున జీవో జారీ చేసి ఇళ్లను ఏర్పాటు చేస్తామని మేయర్ బొంతురామ్మోహన్ బాధితులకు హామీ ఇచ్చారు. ఇక శనివారం రాత్రి ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల కారణంగా అన్నీ ప్రాంతాలు నీటమునిగాయన్నారు. ఈ భారీ వర్షాల నుంచి ప్రజల్ని కాపాడేందుకు సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా మూడు రోజుల పాటు వర్షం ఇలాగే ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో నగరంలో మొత్తంగా 19 రెస్క్యూ టీమ్స్ అలుపెరుగకుండా పని చేస్తున్నాయని స్పష్టం చేశారు.  ఇంకా రిస్క్ టీమ్స్, ఇతర సిబ్బందిని  పెంచుతామని చెప్పారు. వాటర్ లాగింగ్ సెంటర్ల దగ్గర ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపడుతున్నట్లు చెప్పిన మేయర్..నిర్వాసితులకు తక్షణ సాయం కింద ఫుడ్, వాటర్, బ్లాంకెట్స్ అందజేస్తున్నామన్నారు.

Latest Updates