హైటెక్ సిటీ మెట్రో రూట్ కు మంచి రెస్పాన్స్

మెట్రో రైల్ కు జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈమధ్యే హైటెక్ సిటీ రూట్ లో మెట్రో మొదలవడంతో…. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఎల్బీనగర్ – మియాపూర్,  నాగోల్-హైటెక్ సిటీ రెండు కారిడార్లు అందుబాటులోకి రావడంతో ఉద్యోగులు హ్యాపీగా ఫీలవుతున్నారు.  మెట్రో రైడ్ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉందనీ… అయితే స్టేషన్స్ కు చేరుకోవాలంటే.. ఆటో, బస్, షేరింగ్ క్యాబ్స్ లో రావాల్సి వస్తోందంటున్నారు ప్రయాణికులు. మెట్రో స్టేషన్ వరకు వచ్చే చార్జీలు, మెట్రో చార్జీలు కలుపుకుంటే తడిసి  మోపెడు అవుతున్నాయంటున్నారు ప్రయాణికులు. అందువల్ల మంత్లీ పాస్ లు ఇవ్వడంతో పాటు… స్టేషన్స్ నుంచి బస్ లు  నడిపించాలని కోరుతున్నారు. మెట్రో ప్రయాణంతో టైం సేవ్ అవడంతో పాటు.. ట్రాఫిక్, పొల్యూషన్ ఇబ్బందులు తప్పాయంటున్నారు ప్రయాణికులు. అయితే స్టేషన్స్ నుంచి ఆఫీస్ లకు, కాలనీలకు కనెక్టివిటీ ట్రాన్స్ పోర్టేషన్ లేకపోవడంతో ఇబ్బందిగా మారిందంటున్నారు. ఈ ఫెసిలిటీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు ప్రయాణికులు.

హైటెక్  సిటీకి మెట్రో సేవలు ప్రారంభం కావడంతో..  ఐటీ కంపెనీలతో మెట్రో అధికారులు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్  మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్  అండ్  టీ మెట్రో ఎండీ, CEO కె.వి.బి.రెడ్డితో పాటు దాదాపు 40 ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఐటీ కంపెనీల తరపున నడుపుతున్న దూర ప్రాంత షటిల్  సర్వీసులను … మెట్రో స్టేషన్ ల నుంచి నడపాలని సూచించారు అధికారులు. దీంతో ఐటీ ఉద్యోగులు దుర్గం చెరువు, హైటెక్  సిటీ మెట్రో స్టేషన్స్ లో దిగి,  ఫీడర్  సర్వీసుల్లో కంపెనీలకు చేరుకుంటారన్నారు. ఫీడర్  బస్సులు నడిపేందుకు అనుమతుల కోసం సంబంధిత శాఖలతో సంప్రదిస్తామన్నారు.

మంత్లీ పాసులను అందుబాటులోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఐటీ కంపెనీల ప్రతినిధులు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు ఎల్  అండ్  టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి. టికెట్ల కోసం క్యూ కట్టాల్సిన పనిలేకుండా మెట్రో స్మార్ట్  కార్డులు కొనాలని సూచించారు. ఐటీ కంపెనీలు కోరితే బల్క్ గా స్మార్ట్  కార్డులు  జారీ చేస్తామన్నారు. హైటెక్ సిటీ రూట్ ప్రారంభమయ్యాక లక్షా 80వేల మంది రైడర్ షిప్ …. 2లక్షల 20 వేలకు పెరిగిందంటున్నారు మెట్రో అధికారులు. ప్రయాణికుల సంఖ్య మరింత పెంచుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతామంటున్నారు.

 

 

Latest Updates