ఆర్టీసీ ఏసీ బస్సుల కన్నా మెట్రో చీప్

డిసెంబరు కల్లా 66 కిలోమీటర్లు పూర్తి: కేటీఆర్

భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆరేళ్లలో 56 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. డిసెంబరు కల్లా మరో 10 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కేవలం ప్రారం ప్రారంభమైన రెండేళ్లలోనే దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు రోజూ మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారన్నారు.

ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మెట్రోపై పలు ప్రశ్నలు వేశారు. మెట్రో నిర్మాణం ఆలస్యం అవుతోందని, దీని వల్ల రేట్లు పెరిగి ప్రజలకు భారం పడుతోందని అన్నారు.

వారికి మంత్రి కేటీఆర్ సవివరంగా సమాధానమిచ్చారు. ఢిల్లీ మెట్రో తొలి దశలో 60 కిలోమీటర్లు పూర్తి చేయడానికి 9ఏళ్లు, బెంగళూరులో 42 కిమీ 9ఏళ్లు పట్టిందన్నారు. హైదరాబాద్ మెట్రో దాదాపు ఆరేడేళ్లలోనే 66 కిలోమీటర్లు పూర్తవడాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలన్నారు. ఇక, చెన్నై మెట్రో ప్రారంభమై ఐదేళ్లయినా నేటీ ప్రతి

రోజూ 70 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ మెట్రోలో 2 నుంచి 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారన్నారు.

చార్జీలూ తక్కువే

హైదరాబాద్ మెట్రోలో కనీస చార్జీ 10, గరిష్ఠ చార్జీ 60 రూపాయలుగా ఉందని కేటీఆర్ చెప్పారు. అదే చెన్సై మెట్రో కనీసం రూ.10, మ్యాగ్జిమమ్ 70, ఢిల్లీ కనీసం రూ.10, గరిష్టంగా 60గా ఉన్నాయని చెప్పారు.

అలాగే హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీ రూ.15, గరిష్ఠ చార్జీ రూ.80 ఉందన్నా

రు. దీనితో పోలిస్తే హైదరాబాద్ మెట్రో చార్జీ తక్కువేనని చెప్పారు.

హైదరాబాద్ మెట్రో ఎక్కడా అలైన్ మెంట్ మార్పుల కారణంగా ఆలస్యం కాలేదన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెట్రో పనులపై పడిన 300 పైగా పెండింగ్ కేసులను తమ ప్రభుత్వం వచ్చాక పరిష్కరించి, మెట్రో పనులు వేగవంతం చేశామన్నారు. ప్రపంచంలోనే పబ్లిక్-ప్రైవేటు మోడల్ లో నిర్మాణంలో ఉన్న అతి పెద్ద మెట్రో ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అని చెప్పారు. ఇక తమ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా పాత బస్తీలోనూ  మెట్రో నిర్మాణం చేపడుతామని చెప్పారు.

Latest Updates