మెట్రోలో జర్నీచేయాలంటే కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

వెల్లడించిన ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైద‌రాబాద్: న‌గ‌రంలో మెట్రో సేవలు 7 వ తేది నుండి ప్రారంభం కానున్నాయ‌ని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. దశల వారీగా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 7న మియపూర్-ఎల్బీ నగర్, 8న నాగోల్-రాయదుర్గం కారిడార్లలో మెట్రో సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయని ఎండీ తెలిపారు. 9తేదీన పూర్తిస్థాయిలో మెట్రో రైలు సేవలు పునఃప్రారంభం చేస్తామని ఎండీ చెప్పారు. మెదటి 2 రోజులు ఉదయం 7గంటల నుంచి 12వరకు, సాయంత్రం 4గంటల నుంచి 7వరకు మెట్రో సర్వీసులు తిరగనున్నాయి.

సోమ‌వారం ప‌ది నుంచి ప‌దిహేను వేల మంది ప్రయాణికులు మెట్రోలో ప్ర‌యాణించే అవకాశం ఉందని మెట్రో రైల్ ఎండీ తెలిపారు. కోవిద్ నిబంధలు అనుగుణంగా మెట్రో స్టేషన్స్ లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ , సోషల్ డిస్టాన్సింగ్ కోసం మార్కింగ్ ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలిపారు.పీపీఈ కిట్స్, ఫేస్‌షీల్డ్ ధరించి మెట్రో సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు ఎండీ తెలిపారు. నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తామన్నారు. నగదు రహిత రూపంలో ఆన్‌లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ వాడాలని ఆయన పిలుపునిచ్చారు. మినిమమ్ బ్యాగేజ్ ను మాత్రమే అనుమ‌తిస్తామ‌ని చెప్పారు.75 శాతం ఫ్రెష్ ఎయిర్ ట్రైన్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని అన్నారు.

Latest Updates