నేడు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు

hyderabad-metro-rail-trains-to-run-till-1-at-night-for-ipl-final

ఐపీఎల్- 2019 లో భాగంగా నేడు హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  ఈ ఆసక్తికర పోరు కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్ చైన్నైలో జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో హైదరాబాద్ కు మార్చారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడపాలని మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.