29నుండి మైండ్‌స్పేస్ వరకు మెట్రో సేవలు

హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను మరింత దూరం పొడగించనున్నారు. దీంతో ప్రయాణికులు మరికొంత దూరం మెట్రోలను ప్రయాణించవచ్చు.ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం హైటెక్ సిటీ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, ఈ నెల 29 నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు అందుబాటులోకి రానున్నాయి. అదే రోజు మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ మైండ్‌స్పేస్ స్టేషన్ వరకు రైలును ప్రారంభించనున్నారు.

దీంతో మెట్రో కారిడార్-3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి రానుంది. ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి మెట్రో సేవలు ప్రారంభమైతే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం హైటెక్ సిటీ, రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి ఐటీ ఉద్యోగులు షటిల్ సర్వీసుల ద్వారా కంపెనీలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు మైండ్‌స్పేస్ జంక్షన్ స్టేషన్ అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత ఈజీ అవుతుంది.

Latest Updates