సిగ్నలింగ్ లో సమస్య..నిలిచిపోయిన మెట్రో

హైదరాబాద్ లో మరోసారి మెట్రో  సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో… ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో.. మెట్రో రైళ్లు కాసేపు ఆగిపోయాయి. దీంతో.. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులంతా ఇబ్బందులు పడ్డారు. కారిడార్ 1 లో ఉన్న వివిధ స్టేషన్లన్నీ… ప్రయాణికులతో నిండిపోయాయి. సిగ్నలింగ్ లో సమస్య తలెత్తడంతో.. సేవలకు అంతరాయం కలిగిందని మెట్రో ఎండీ తెలిపారు. చాలా సేపటి తర్వాత.. సమస్యను పరిష్కరించి రైళ్లను పునరుద్ధరించారు. ఇవాళే కాదు.. ఈ మధ్యకాలంలో చాలా సార్లు మెట్రో  సేవలకు అంతరాయం కలిగింది. ఇప్పుడు మళ్లీ రిపీట్ అయ్యింది. దీంతో.. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ గా వస్తున్న సమస్యలకు.. శాశ్వతంగా పుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు.

Latest Updates