మారిన వేళలు : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు విజ్ఞప్తి

కరోనా కారణంగా రవణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదారబాద్ లో కరోనా కారణంగా బస్సులతో పాటు మెట్రోట్రైన్ల సర్వీసులు సైతం నిలిచిపోయాయి. అయితే తాజాగా  మెట్రోట్రైన్ల సర్వీసులను పున ప్రారంభించడంతో పాటు సమయాల్ని పొడిగించింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతానికి ఉదయం 7.00 నుండి ప్రారంభమై రాత్రి 9.30 వరకు ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా డిసెంబర్ 3నుంచి  ఉదయం 6.30 నుండి రాత్రి 9.30 వరకు మెట్రో రైల్‌ నడవనుంది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు సమయం పొడిగించడంతో పాటు  భరత్‌నగర్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు తెరుచుకోనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Latest Updates