ముఠా అరెస్ట్ : మటన్‌‌ షాపులో జింక మాంసం

హైదరాబాద్, వెలుగు: పేరుకేమో మటన్‌‌ దుకాణం.. అక్కడ జింకలు, కుందేళ్లు, పిచ్చుకల మాం సమూ దొరుకుతుంది.. ఆర్డర్‌‌పైనా సప్లై చేస్తారు.. ఇలా గుట్టుగా వ్యా పారం చేస్తున్న ముఠా మంగళవారం పోలీసులకు చిక్కింది. షాప్‌ పై దాడి చేసి ఈస్ట్‌‌ జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు.. వ్యా పారిని అరెస్టు చేసి రెండు జింకల మాంసంతో పాటు 3 కుందేళ్లు, 22 కౌజులను స్వాధీనం చేసుకున్నారు. ముర్గీచౌక్ అడ్డాగా..ఫలక్ నుమా జహనూమాకు చెం దిన సయ్యద్ జమీర్ (32) పదేళ్ళుగా ముర్గీచౌక్ లో మటన్ షాప్ నడుపుతున్నాడు. మంచి మాంసం అమ్మేవాడిగా పేరుంది. బహదూర్‌‌పురా ఉస్మాన్‌‌ భాగ్‌ కు చెందిన మహ్మద్ అలీ(25)తో జమీర్‌‌కు రెం డేళ్ల క్రితం పరిచయమైంది.

జింక, కుందేళ్లు, కౌజు పిట్టల మాంసమూ  అమ్మితే మంచి లాభాలొస్తాయని జమీర్‌‌కు అలీ చెప్పాడు. జింకలను తాను తీసుకొస్తానన్నాడు. తనకు పరిచయమున్న వేటగాళ్ల ద్వారా మాంసాన్ని జమీర్‌‌కు సప్లయ్ చేసేవాడు. కావాల్సిన కస్టమర్లకు ఆర్డర్లతో సప్లై చేసేవారు. కుందేళ్లు, కౌజు మాంసాన్నీ అమ్మేవారు. సమాచారం అందుకున్న సిటీ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జమీర్ ఇంటిపై దాడిచేసి అరెస్టు చేశారు. మాం సం సప్లయ్ చేస్తున్న అలీ పరారీలో ఉన్నాడని అదనపు టాస్క్ ఫోర్స్ డీసీపీ చైతన్యకుమార్ చెప్పారు.  అలీని 2017 ఏప్రిల్‌‌లో అటవీ అధికారులు అరెస్టు చేశారన్నారు.

Latest Updates