ఐర్లాండ్‌‌ తొలి విమెన్‌‌ ఇంటర్నేషనల్‌‌ మాస్టర్‌‌గా త్రిష

హైదరాబాద్‌‌, వెలుగు:  భాగ్యనగరంలో పుట్టిన చెస్‌‌ యువ ప్లేయర్‌‌ కన్యమరాల త్రిష ఐర్లాండ్‌‌లో సత్తా చాటుతోంది. ఐర్లాండ్‌‌ తరఫున విమెన్‌‌ ఇంటర్నేషనల్‌‌ మాస్టర్ (డబ్ల్యూఐఎమ్‌‌) టైటిల్‌‌ సాధించిన తొలి ప్లేయర్‌‌గా చరిత్ర సృష్టించింది. డబ్ల్యూఐఎమ్‌‌కు కావాల్సిన మూడో నార్మ్‌‌ను 14 ఏళ్ల త్రిష..  ఇటీవల జరిగిన ఐరిష్‌‌  న్యూఇయర్‌‌ నార్మ్‌‌ ఈవెంట్‌‌లో అందుకుంది.  ప్రస్తుతం 2195 ఎలో రేటింగ్‌‌ పాయింట్లతో ఉన్న తెలుగమ్మాయి ఐర్లాండ్‌‌లో హైయెస్ట్‌‌ రేటెడ్‌‌ మహిళా ప్లేయర్‌‌ కావడం విశేషం.  2005లో హైదరాబాద్‌‌లో పుట్టిన త్రిష  ప్రస్తుతం పోర్ట్‌‌లవోయిస్‌‌ కాలేజ్‌‌లో జూనియర్‌‌ సైకిల్‌‌ సెకండ్‌‌ ఇయర్‌‌ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఇరవై ఏళ్ల నుంచి  ఐర్లాండ్‌‌లో ఉంటున్నారు. త్రిషకు ఐర్లాండ్‌‌ సిటిజన్‌‌షిప్‌‌ లభించింది.

More News: హార్దిక్‌‌ కోసం సెలెక్షన్‌‌ వాయిదా వేశారు

ఇండియా Vs ఆసీస్‌‌: నేడే ఆఖరి పోరు

రీ ఎంట్రీతో అదరగొట్టిన సానియా.. టైటిల్ కైవసం

 Hyderabad origin girl Trisha became is playing in Ireland first international chess master

Latest Updates