హైదరాబాదీల ‘షిప్పు షికార్లు ’

hyderabad-people-going-to-sea-places-for-summer-vacation

వేసవి వచ్చేసింది. హాలిడే సీజన్ మొదలైంది.మామూలుగా ఈ టైమ్ లో పల్లెకు బైలెల్లే హైదరాబాద్ జనం.. ఇప్పుడు షిప్పుల్లో షికార్లు చేస్తున్నరు.అలాగే పండుగలు, పెళ్లిరోజులు, పుట్టినరోజులు..ఇలా ఫంక్షన్ ఏదైనా క్రూయిజ్ (భారీ నౌక)లలో వెళ్తున్నరు. సముద్రంలోనే వేడుకలు జరుపుకుంటున్నారు .ఏటా సముద్ర ప్రయాణాలు చేస్తున్న ఇండియన్లలో హైదరాబాదీల సంఖ్య పెరుగుతోందని క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (సీఎల్ఐఏ) వర్గాలు వెల్లడించాయి.

లగ్జరీ క్రూయిజ్ లలోనే..

గత రెండేళ్లలో క్రూయిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో విదేశాలకు వెళ్తున్నవారి సంఖ్య పెరిగిందని ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైన్ ఆపరేటర్ సంస్థలు వెల్లడించాయి. పెద్ద పెద్దరెస్టారెంట్లు, మంచి లాడ్జింగ్ ఫెసిలిటీలు ఉంటాయన్న కారణంతో ఎక్కువ మంది లగ్జరీ క్రూయిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వెళ్తున్నారని స్థానిక ట్రావెల్ ఏజెంట్లు వెల్లడించారు.దేశంలో ఇతర సిటీలతో పోలిస్తే లగ్జరీ క్రూయిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బుకింగ్స్ హైదరాబాద్ లోనే ఎక్కువ జరుగుతున్నాయని తిరుణ్ ట్రావెల్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ వరుణ్ చడ్డా చెప్పారు.

వైజాగ్ నుంచి కాకుండా..

హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ క్రూయిజ్ టూర్లకు వెళ్లే వారిలో చాలా మంది ముంబై, కొచ్చి,దుబాయ్, సింగపూర్ నుంచి తమ సముద్ర ప్రయా-ణాన్ని ప్రారంభిస్తున్నారు . కానీ పక్కనే ఉన్న విశాఖప-ట్నం నుంచి మాత్రం వెళ్లడం లేదు. ‘‘ప్రస్తుతం  వైజాగ్ నుంచి అండమాన్, నికోబార్ దీవులకు క్రూయిజ్ లువెళ్తున్నా యి. వైజాగ్ పోర్టులో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఇప్పటికే మాకు లేఖ రాసింది”అని వరుణ్ చడ్డా చెప్పారు.

రాష్ట్రంలో రివర్ క్రూయిజ్ లు

ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు పడిన మూడేళ్ల తర్వాత 2017 నవంబర్ లో తెలంగాణ ప్రభుత్వం రివర్ క్రూయిజ్ లను ప్రవేశపెట్టింది. రాష్ర్టం లోని నాగార్జున సాగర్, నల్గొండతోపాటు ఏపీలో శ్రీశైలం మధ్య నడిపింది. లోకల్ క్రూయిజ్ ప్రయోగం విజయవంతమైందని రాష్ర్ట టూరిజం డెవలప్ మెం ట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

సముద్ర  ప్రయాణం మొదలు పెట్టిన ప్రాంతంలోనే తమ టూర్ ను తిరిగి పూర్తి చేసేందుకు టూరిస్టులు ఇష్టపడుతున్నారు. అంటే క్రూయిజ్ ను మొదట ఎక్కిన చోట దిగాలని భావిస్తున్నారు.

రష్యా, ఈజిప్ట్, వియత్నాం, కాంబోడియా దేశాల టూర్ కు ఇండియా నుంచి వేలాది మంది వెళ్తున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్లు కూడా ఎక్కువే.

సముద్ర మార్గం ద్వారా ఇండియన్  టూరిస్టులు ఇంకా వెళ్లని రూట్లు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది మాత్రమే బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్, ప్యూర్టో రికో వంటి చోట్లకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్లాలంటే టూరిస్టులకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథెంటి కేషన్ తప్పనిసరి.

సిటీ నుంచి టూరిస్టులు చైనాకు కూడా క్రూయిజ్లలో వెళ్తున్నారు .

డిమాండ్ ఉన్న రూట్లు

యూరప్, మధ్యదరా దేశాలు, కరీబియన్ దేశాలు, అలస్కా, గలాపగస్ దీవులు(ఈక్వెడా -ర్), సింగపూర్.

ప్యాకేజీలు ఇలా..

180 డాలర్లు (సుమారు రూ.12,500) నుంచి2,500 డాలర్లు (1.73 లక్షలు) టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. సీజన్ ను బట్టి ప్యాకేజీలో మార్పులు ఉంటాయి.

37 శాతం పెరుగుదల

క్రూయిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ప్రయాణాలు చే స్తు న్న హైద-రాబాదీల సంఖ్య 2017తో పోలిస్తే 2018లో37 శాతం పెరిగింది. సిటీ నుంచి క్రూయిజ్లలో టూర్లకు వెళ్తున్న వారిలో 22 శాతంమంది ఫ్యామీలీతో కలిసి వెళ్తున్నారు . మిగిలినవాళ్లు కార్పొరే ట్, బిజినెస్ టూర్లలో భాగంగావెళ్తున్నారు .క్రూయిజ్ టూరిస్టులు

‘‘ఇటీవల హైదరాబాద్ లో రోడ్ షోనిర్వహించాం. క్రూయిజ్ టూర్లను ప్రమోట్చేస్తు న్న 30 వరకు లోకల్ టూర్ ఆపరేటర్సంస్థలతో మాట్లాడాం. లగ్జరీ షిప్పుల్లోసౌకర్యాల గురించి తెలుసుకున్నారు’’- వరుణ్ చడ్డా , తిరుణ్ ట్రావెల్ మార్కెటింగ్,రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ సంస్థ ఇండియా రెప్రజెంటేటివ్

Latest Updates